MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Eyes: కళ్ల మంటలతో ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇలా చేస్తే ఆ సమస్య మటుమాయం అవుతుంది..

Eyes: కళ్ల మంటలతో ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇలా చేస్తే ఆ సమస్య మటుమాయం అవుతుంది..

Eyes: గంటలకు గంటలు ఫోన్లను చూడటం లేదా ఎక్కువ సేపు లాప్ టాప్ లను ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు తలెత్తుతాయి. అందులోనూ కళ్ల మంటలు, కళ్లనుంచి నీరు కారడం, దురద పెట్టడం వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసా..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 21 2022, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Eyes: ఎక్కువ సేపు స్క్రీన్ ను చూడటం వల్ల కంటి నొప్పి వస్తుంటుంది. ఇది సర్వసాధారణ విషయం అయినప్పటికీ గంటల తరబడి ఫోన్లు, లాప్ టాప్ లు చూడటం వల్ల కంటి చూపు మందగించే ప్రమాదం పొంచి ఉంది. వాతావరణ మార్పుల వల్ల కూడా కంటి సమస్యలు తలెత్తుతాయి. వీటికి తోడు గంటల తరబడి కాంటాక్ట్ లెన్సులు వేసుకుంటే కూడా ఈ సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి కారణాల వల్ల కళ్ల నుంచి నీళ్లు కారడం, ఇన్ఫెక్షన్, అలర్జీలు వస్తాయి. కాగా కళ్లలో దురద డస్ట్ మైట్స్ వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కళ్ల నొప్పి, దురద నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి. ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. మఖ్యంగా వీటివల్ల ఎలాంటి సైడె ఎఫెక్ట్స్ కూడా రావు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఆముదంతో కంటి దురదను ఈజీగా దూరం చేయవచ్చు. ఈ ఆముదంలో యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల దురద తగ్గుతుంది. కాటన్ ను బాల్స్ లా చేసి ఆ నూనెల్ కొద్ది సేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ కాటన్ బాల్స్ నుంచి నూనెను మొత్తం పిండి కళ్లపై రుద్దుతూ ఉండాలి. 15నుంచి 20 నిమిషాల పాటు వాటిని కళ్లపైనే ఉంచి.. ఆ తర్వాత శభ్రంగా నీళ్లతో కడగాలి.

35

కళ్లు దురదగా ఉంటే కళ్లపై ఐస్ క్యూబ్స్ పెట్టడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. కళ్ల వాపు ఉన్నా, ఎర్రగా మారిగా, చికాకు పెట్టినా కళ్లపై ఐస్ క్యూబ్స్ ను పెడితే ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చు. వీటిని ఎలా ఉపయోగించాలంటే.. నీట్ గా ఉండే ఒక క్లాత్ ముక్కను తీసుకుని వాటిలో ఐస్ క్యూబ్ లను చుట్టండి. దాన్ని కళ్లపై కొన్ని నిమిషాలు ఉంచండి. ఇలా ఉంచడం కష్టం అనుకుంటే కళ్లపై ఆష్ క్యూబ్ వాటన్ ను చల్లుకున్నా పర్లేదు. ఇలా చేయడం వల్ల కంటి దురద నుంచి ఈజీగా బయటపడొచ్చు. అయితే ఈ పద్దతిని రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఖచ్చితంగా చేయాలి.
 

45

 దోసకాయలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6, రోబోఫ్లేవిన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇది కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు కళ్లపై నల్లటి వలయాలు ఏర్పడినప్పుడు వాటిని తొలగించేందుకు కూడా ఈ దోసకాయ ముక్కను ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల కళ్లు హైడ్రేట్ గా, తాజాగా అవుతాయి. దోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల చికాకును, వాపును కూడా తగ్గిస్తుంది. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేస్తే సరి. కళ్ల సమస్యను మటు మాయం చేయవచ్చు.
 

55

కళ్ల దురద, మంటలను దూరం చేయడంలో గ్రీన్ టీ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉంటే టానిక్ యాసిడ్ దురదను తగ్గించడంలో సహాయపడుతుంది.  లావెంటర్ టీ బ్యాగ్ లను కళ్లపై ఉంచడం వల్ల కళ్లమంటను దూరంచేయవచ్చు. ఈ టీ బ్యాగ్ లను ఒక అర్థ గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ తర్వాత కళ్లపై పెట్టుకోవాలి. దీనిని 10-15 నిమిషాల పాటు అలా ఉంచితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.   

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pearl nose pins: ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం
Recommended image2
Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!
Recommended image3
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved