MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chicken Cleaning tips: వండే ముందు చికెన్‌ను 2 నిమిషాల్లో క్లీన్ చేసే టిప్స్ ఇవిగో

Chicken Cleaning tips: వండే ముందు చికెన్‌ను 2 నిమిషాల్లో క్లీన్ చేసే టిప్స్ ఇవిగో

Chicken Cleaning tips: చికెన్ వండే ముందు దాన్ని బాగా శుభ్రం చేయడం ఎంతో ముఖ్యం. లేదంటే దాని నీచు వాసన వచ్చేస్తుంది. కూర తినాలనిపించదు. చికెన్ క్లీన్ చేయడానికి కొన్ని సింపుల్ పద్ధతులు ఉన్నాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 05 2026, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చికెన్ ఎందుకు శుభ్రం చేయాలి?
Image Credit : Getty

చికెన్ ఎందుకు శుభ్రం చేయాలి?

చికెన్ వండే ముందు దాన్ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు కూడా పదేపదే చెబుతున్నారు.  చికెన్‌పై మట్టి, రక్తపు అవశేషాలు లేదా సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుంది. సరైన పద్ధతిలో చికెన్ శుభ్రం చేయడం వల్ల ఇవి కొంతవరకు తొలగిపోతాయి. అలాగే వండే సమయంలో పూర్తిగా అధిక ఉష్ణోగ్రత వద్ద వాటి శక్తి నశిస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. సరైన శుభ్రత పాటిస్తే ఆహారం రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. 

24
చికెన్ ఇలా శుభ్రం చేయండి
Image Credit : Getty

చికెన్ ఇలా శుభ్రం చేయండి

చికెన్ నీచు వాసన వస్తే ఆ కూర రుచి ఏమాత్రం బాగుండదు. ఆ వాసన పోగొట్టడానికి ఒక చెంచా నిమ్మరసం లేదా ఒక చెంచా వెనిగర్ తీసుకోవాలి.  దాన్ని చికెన్‌ ముక్కలకు బాగా పట్టించి అయిదు నిమిషాల పాటూ వదిలేయాలి. తర్వాత మెల్లగా చేత్తోనే రుద్దుతూ నీటితో కడిగేయాలి.

చికెన్ తెచ్చిన తర్వాత, ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని రెండు చెంచాల ఉప్పు కలపాలి. శుభ్రమైన చేతులతో చికెన్ మొత్తానికి ఉప్పు పట్టించాలి. దీనివల్ల చికెన్‌పై ఉండే జిగురు, మురికి సులభంగా పోతాయి. అలాగే కొన్ని రకాల సూక్ష్మ క్రిములు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. 

Related Articles

Related image1
Viral Video: శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టిన మహిళ, వణికిపోయిన డెలివరీ బాయ్
Related image2
Naga chaitanya sobhita: పెళ్లయ్యాక ఒక్కరోజూ కూడ వంట చేసి పెట్టలేదు, రోజూ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడమే
34
గోధుమ పిండితో
Image Credit : Getty

గోధుమ పిండితో

గోధుమ పిండితో కూడ చికెన్ ను శుభ్రపరచవచ్ు. ఈ చిట్కా చాలా తక్కువ మందికే తెలుసు. కొద్దిగా గోధుమ పిండిని చికెన్‌పై వేసి బాగా రుద్దాలి.  ఆపై నీటితో కడిగేయాలి. దీని వల్ల చికెన్ చాలా శుభ్రంగా మారడంతో పాటూ తాజాగా ఉంటుంది.

44
పసుపుతో క్లీనింగ్
Image Credit : Getty

పసుపుతో క్లీనింగ్

చికెన్ శుభ్రపరిచేందుకు ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి.  అందులో అర చెంచా పసుపు కలపాలి. తర్వాత చికెన్‌ను 5 నుంచి 7 నిమిషాల పాటు అందులో నానబెట్టాలి. ఆ తర్వాత చేత్తోనే మెల్లగా రుద్దుతూ కొళాయి కింద పెట్టి నీటితో కడిగేయాలి. దీనివల్ల చికెన్‌లోని బ్యాక్టీరియా చనిపోతుంది.  చికెన్ పరిశుభ్రంగా మారుతుంది. చికెన్‌ను చివరిసారిగా కొళాయి కింద పెట్టి పారే నీటి కింద పెట్టి కడగాలి. దీనివల్ల ఉప్పు, పసుపు, నిమ్మకాయ అవశేషాలు ఏవైనా ఉంటే పోతాయి. చికెన్ తాజాగా, మృదువుగా తయారవుతుంది. అలాగే ఎలాంటి నీచు వాసన రాదు. ఇలా చేస్తే చికెన్ చాలా శుభ్రపడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Jamun Seeds: ఈ గింజలతో షుగర్‌కు చెక్.. బీపీ కూడా కంట్రోల్!
Recommended image2
Child Psychology: పిల్లల్ని ఎక్కువగా పొగుడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Recommended image3
Gold Polish Hacks: నల్లబడిన నగలు నిమిషాల్లో మెరిసిపోవాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి!
Related Stories
Recommended image1
Viral Video: శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టిన మహిళ, వణికిపోయిన డెలివరీ బాయ్
Recommended image2
Naga chaitanya sobhita: పెళ్లయ్యాక ఒక్కరోజూ కూడ వంట చేసి పెట్టలేదు, రోజూ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved