ఈ వింటర్ ఫుడ్స్ ను తింటే మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది
చలికాలంలో కొన్ని ఆహారాలను తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. ముఖ్యంగా ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
brain health
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి. మెదడు ఆరోగ్యం బాగాలేని వారు ఎప్పుడూ విపరీతమైన తలనొప్పి, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, అలసట, ఎటూ తోచకపోవడం, అభిజ్ఞా క్షీణత వంటి సమస్యలు వస్తాయి. ఇతర అవయవాల మాదిరిగానే మెదడు కూడా మెరుగ్గా పనిచేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషణపై ఆధారపడుతుంది. ఆహారం మన శరీరానికి పోషకాల ప్రాధమిక వనరు. కాబట్టి మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సీజన్ లో ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గుడ్లు
గుడ్లను ఈ సీజన్ లోనే తినాలన్న నిబంధనలు ఏమీ లేవు. వీటిని సంవత్సరం పొడవునా తినొచ్చు. అయితే వాటి లక్షణాల కారణంగా వీటిని చలికాలంలో, చల్లని ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాలలో ఇవి అనుకూలంగా ఉంటాయి. గుడ్లలో ఉండే ఎన్నో పోషకాలు మెదడు వ్యాధులు, గాయాలు, స్ట్రోక్ లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఏదేమైనా మీ ఆహారంలో గుడ్లను చేర్చడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. అలాగే మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు బలంగా ఉంటాయి. అందుకే రోజుకు ఒక గుడ్డునైనా తినండి.
చేపలు
ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ (ఈఎఫ్ఏ)లను ఆహారం నుంచే తీసుకోవాలి. ఎందుకంటే వీటిని మన శరీరం ఉత్పత్తి చేయలేదు. ఆరోగ్యకరమైన మెదడు, గుండె, కీళ్ళు, మొత్తం ఆరోగ్యం బాగుండటానికి ఈ కొవ్వులు చాలా అవసరం. ఈ క్రియాశీల కొవ్వులు ఫ్యాటీ ఫిష్ లో రెడీమేడ్ రూపంలో ఉంటాయి. సాల్మన్, ట్రౌట్, ఇతర కొవ్వు చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి.
పెరుగు
పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. పెరుగును తినడం వల్ల కడుపు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటాయి. పెరుగు మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగు సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో మీ ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది. ఆనందంగా ఉంటారు. పెరుగులో మెగ్నీషియం, పొటాషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ మెదడులో ఆక్సిజన్ మొత్తాన్ని పెంచడానికి సహాయపడుతాయి.
బచ్చలికూర
చలికాలంలో తప్పకుడా తినాల్సిన ఆహారాల్లో బచ్చలికూర ఒకటి. బచ్చలికూరలో ఫోలేట్, ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సిలతో పాటుగా పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. దీనిలో ఉండే ఫోలేట్ మతిమరుపు, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
tomatoes
టమోటాలు
టమోటాలలో యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చిత్తవైకల్యం, ముఖ్యంగా అల్జీమర్స్ లక్షణాలను తగ్గిస్తాయి. అంతేకాదు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. శోషణను పెంచడానికి కొద్దిగా ఆలివ్ నూనెతో వండిన టమోటాలను తినండి. బొప్పాయి, పుచ్చకాయ, పింక్ కలర్ లో ఉండే ద్రాక్షలో ఇతర రక్షితమైన ఫైటోన్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి.
Image: Getty Images
గుమ్మడికాయ
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం అన్నీ గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడతాయి. సలాడ్లు, శాండ్విచ్లు, ఇతర ఆహారాలలో టాపింగ్లుగా తరచుగా ఉపయోగించే పండ్ల విత్తనాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.