MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Bitter gourd: చేదు లేకుండా కాకరకాయ కూర టేస్టీగా ఉండాలంటే వెరీ సింపుల్ టిప్స్ ఇదిగో

Bitter gourd: చేదు లేకుండా కాకరకాయ కూర టేస్టీగా ఉండాలంటే వెరీ సింపుల్ టిప్స్ ఇదిగో

Bitter gourd: కాకరకాయ చేదుగా ఉంటుందని ఎక్కువ మంది తినరు. కానీ కాకరకాయలోని చేదును చాలా సింపుల్ పద్దతిలో తీసేయవచ్చు. కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే, కాకరకాయలోని చేదును తగ్గించి, ఎంతో రుచిగా వండుకోవచ్చు. ఆ టిప్స్ ఇవిగో.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 16 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కాకరకాయలోని చేదు
Image Credit : Freepik

కాకరకాయలోని చేదు

కాకరకాయ అనగానే అందరికీ చేదు రుచే గుర్తొస్తుంది. అందుకే కాకర కాయ కూరను, వేపుడు వంటివి తినేందుకు ఇష్టపడరు.  కానీ ఈ చేదులోనే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది, జీర్ణక్రియను చక్కగా మెరుగుపరుస్తుంది. దీని చేదు వల్ల చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు. ఎంత ఆరోగ్యమైనా కూడా చేదుగా ఉండే కూరను తినేందుకు పిల్లలు ఇష్టపడరు.  కానీ ఆ చేదును పోగొట్టడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చేదును ఇలా తగ్గించండి
Image Credit : gemini

చేదును ఇలా తగ్గించండి

కాకరకాయలోని చేదును తగ్గించేందుకు పెరుగు మంచి మార్గం. తరిగిన కాకరకాయ ముక్కలను కాసేపు పెరుగులో నానబెడితే వాటిలో ఉండే చేదు రుచి తగ్గిపోతుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ కాకరకాయను కొద్దిగా మృదువుగా మార్చి దానిలోని తీవ్రమైన చేదును తగ్గిస్తుంది. తర్వాత కడిగి వండితే చేదు రుచి తగ్గుతుంది. అలాగే పోషక విలువలు కూడా పెరుగుతాయి.

34
వెనిగర్ వేయండి
Image Credit : gemini

వెనిగర్ వేయండి

కాకరకాయలోని చేదును పోగొట్టేందుకు వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. తరిగిన కాకరకాయ ముక్కలను సుమారు 10-15 నిమిషాల పాటు వినెగర్‌లో నానబెట్టండి. వినెగర్‌లోని ఆమ్ల గుణం కాకర కాయలోని చేదు రసాన్ని బయటకు పోయేలా చేస్తుంది. ఆ తర్వాత  ఆ ముక్కలను మంచి నీటితో కడిగి వండితే చేదు రుచే రాదు.

కాకరకాయ చేదును తగ్గించడానికి మరో రుచికరమైన మార్గం సరైన మసాలాలు వాడటం. ఉల్లిపాయలు, వెల్లుల్లి, మంచి మసాలాలు వేసి కాకరకాయను బాగా వేయిస్తే  చేదు రుచి చాలా వరకు తగ్గిపోతుంది.

44
ఉప్పు చల్లి
Image Credit : stockPhoto

ఉప్పు చల్లి

కాకరకాయ చేదును ఎక్కువ మంది ఉపయోగించే పద్దతి ఉప్పు చల్లడం. కాకరకాయలను సన్నగా తరిగి, వాటిపై కొద్దిగా ఉప్పు చల్లి 15-20 నిమిషాలు పక్కన పెట్టండి. ఉప్పు నెమ్మదిగా లోపలి చేదు రసాన్ని బయటకు తెస్తుంది. తరువాత కాకరకాయ ముక్కలను చేత్తోనే పిండితే చేదు ఆ నీరు రూపంలో బయటికి పోతుంది. 

కాకరకాయ చేదును త్వరగా తగ్గించాలంటే వాటిని ముందుగా ఉడికించడం మంచిది. తరిగిన కాకరకాయ ముక్కలను కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో 5-7 నిమిషాలు ఉడికించాలి. ఆ ముక్కలను తీసి నీటిని పారబోయండి. ఇలా ఉడికించడం వల్ల కాకరకాయ మెత్తబడటమే కాకుండా, దాని చేదు కూడా బాగా తగ్గుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image2
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Recommended image3
Thummi Kura: ఏడాదిలో ఒక్క‌సారే తినే వంట‌కం.. తుమ్మి కూర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
Coconut Milk: తక్కువ పెట్టుబడితో లక్షల్లో లాభాలు కావాలంటే కొబ్బరి పాలు బిజినెస్ మొదలుపెట్టేయండి
Recommended image2
Sun Transit: ఉచ్ఛస్థితిలోకి సూర్యుడు.. ఈ రాశులకు నెల రోజుల పాటు రాజయోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved