MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Coconut Milk: తక్కువ పెట్టుబడితో లక్షల్లో లాభాలు కావాలంటే కొబ్బరి పాలు బిజినెస్ మొదలుపెట్టేయండి

Coconut Milk: తక్కువ పెట్టుబడితో లక్షల్లో లాభాలు కావాలంటే కొబ్బరి పాలు బిజినెస్ మొదలుపెట్టేయండి

Coconut Milk:  కొబ్బరి పాలను తెల్ల బంగారం అని పిలుచుకోవచ్చు.  ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరువాత కొబ్బరి పాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వ్యాపారం చేయాలనుకునే వారికి ఒక సువర్ణావకాశం. ఆధునిక టెక్నాలజీతో ఈ బిజినెస్‌లోకి అడుగుపెడితే లాభాలు వస్తాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 15 2026, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొబ్బరి పాల మార్కెట్
Image Credit : Gemini AI

కొబ్బరి పాల మార్కెట్

ఇప్పుడు ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడుతాయో చెప్పలేని పరిస్థితి. అందుకే ఎంతో ఉద్యోగాలను వదిలి బిజినెస్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు ఇచ్చే బిజినెస్ ఐడియాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో కొబ్బరిపాలు బిజినెస్ ఒకటి.  కొబ్బరి పాలను వంటలకే కాకుండా, సౌందర్య సాధనాలు, ఐస్‌క్రీమ్‌లు, డ్రింక్స్ తయారీలో కూడా ఎక్కువగా వాడుతున్నారు. రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఇళ్లలో కూడా దీనికి డిమాండ్ బాగా ఉంది. యూరప్, అమెరికా దేశాల్లో 'వీగన్' కల్చర్ పెరగడంతో అక్కడి నుంచి భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏ వస్తువులు అవసరం
Image Credit : Getty

ఏ వస్తువులు అవసరం

మీరు కొబ్బరి పాల వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే  ప్రధాన ముడిసరుకు బాగా ముదిరిన కొబ్బరికాయలు అవసరం. దీని కోసం కొబ్బరి తోటలు ఉన్న వారితో అనుసంధానం అవ్వాలి. వారి నుంచి ప్రతిరోజూ కొబ్బరికాయలు కొనుక్కోవాలి.  ముందుగా కాయలను పగలగొట్టి, తురిమి, యంత్రాల సాయంతో పాలను పిండుతారు. మొదటిసారి తీసిన చిక్కటి పాలను (Thick milk), రెండోసారి తీసిన పల్చటి పాలను (Thin milk) వేరు చేస్తారు.

35
అవసరమైన యంత్రాలు
Image Credit : stockphoto

అవసరమైన యంత్రాలు

వ్యాపారపరంగా పెద్ద ఎత్తున చేయాలనుకుంటే కొన్ని యంత్రాలు అవసరం. కొబ్బరి తురిమే యంత్రం (Coconut Grater), పాలు పిండే యంత్రం (Milk Extractor), వడపోత యంత్రం (Filtration Machine), పాశ్చరైజేషన్ యూనిట్ (Pasteurization Unit - ఇది పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ముఖ్యం), ప్యాకింగ్ యంత్రం (Packing Machine) వంటివి కొనాల్సిన అవసరం ఉంది.

45
పెట్టుబడి ఎంత?
Image Credit : Getty

పెట్టుబడి ఎంత?

ఇదొక చిన్న తరహా పరిశ్రమగా చెప్పుకోవచ్చు. రూ. 2 లక్షల నుంచి 5 లక్షల పెట్టుబడితో దీన్ని మొదలుపెట్టవచ్చు. లేదా పెద్ద తరహా పరిశ్రమగా కూడా మొదలుపెట్టవచ్చు. ఆటోమేటిక్ యంత్రాలతో ప్రారంభించాలంటే రూ. 15 లక్షల నుంచి 25 లక్షల వరకు అవసరం. లాభం కూడా భారీగా వస్తుంది.  కొబ్బరి పాలతో పాటూ ఇతర ఉప ఉత్పత్తులను అమ్మడం ద్వారా 30 శాతం నుంచి 40 శాతం వరకు లాభం పొందవచ్చు.

55
లైసెన్సులు తీసుకోవాలి
Image Credit : Getty

లైసెన్సులు తీసుకోవాలి

ఇది ఆహార సంబంధిత వ్యాపారం కాబట్టి చట్టపరమైన అనుమతులు తప్పనిసరి. FSSAI లైసెన్స్, GST రిజిస్ట్రేషన్, MSME రిజిస్ట్రేషన్ (ప్రభుత్వ సబ్సిడీలు, లోన్ల కోసం) అవసరం. కొబ్బరి పాలు త్వరగా పాడైపోతాయి. UHT (అల్ట్రా హై టెంపరేచర్) ట్రీట్‌మెంట్ లేదా కానింగ్ పద్ధతి వాడితే 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. పాలు తీయగా మిగిలిన పిప్పిని పశువుల దాణాగా అమ్మి అదనపు ఆదాయం పొందవచ్చు. సరైన మార్కెటింగ్, మంచి ప్యాకేజింగ్‌తో ఈ వ్యాపారంలో త్వరగా సక్సెస్ అవ్వొచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఆహారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Recommended image2
Post office: రూ. 5 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో రూ. 7.25 ల‌క్ష‌లు పొందొచ్చు.. జీరో రిస్క్
Recommended image3
Home Loan : సిబిల్ స్కోర్ తక్కువున్నా హోమ్ లోన్ కావాలా? అయితే ఈ 7 టిప్స్ పాటించండి
Related Stories
Recommended image1
Sobhita Dhulipala: ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్న శోభిత.. నేటి హీరోయిన్లకు రోల్ మోడల్
Recommended image2
Venus Jupiter Conjuction: శుక్ర గురు గ్రహాల ద్విదశ యోగం.. ఈ 4 రాశుల వారు ధన వర్షానికి సిద్ధమైపోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved