MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Heat Stroke: ఎండ దెబ్బ త‌గిలిన‌ప్పుడు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏంటి.? ఎప్పుడు అల‌ర్ట్ అవ్వాలి.?

Heat Stroke: ఎండ దెబ్బ త‌గిలిన‌ప్పుడు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏంటి.? ఎప్పుడు అల‌ర్ట్ అవ్వాలి.?

Heat Stroke: ఎండ తీవ్ర‌త పెరుగుతోంది. ఉద‌యం 8 గంట‌ల‌కే సుర్రుమంటోంది. ఈ క్ర‌మంలోనే ఎండ‌లో ఎక్కువ‌గా తిరిగే వారికి వ‌డ దెబ్బ త‌గ‌ల‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. అయితే ఎండ దెబ్బ త‌గిలిన‌ప్పుడు శ‌రీరంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : May 03 2026, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎండ దెబ్బ అంటే ఏంటి.?
Image Credit : Gemini AI

ఎండ దెబ్బ అంటే ఏంటి.?

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగినప్పుడు శరీరం తట్టుకోలేని స్థితి వస్తే దానిని ఎండ దెబ్బ (Heatstroke) అంటారు. ఇది చిన్న విషయం కాదు. సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాపాయం కూడా కలిగించవచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బయట ఎక్కువగా పనిచేసే వాళ్లకు ఇది త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎండ దెబ్బ‌కు ముందే కనిపించే ముఖ్య లక్షణాలు
Image Credit : freepik.com

ఎండ దెబ్బ‌కు ముందే కనిపించే ముఖ్య లక్షణాలు

ఎండ దెబ్బ ఒక్కసారిగా రాదు. ముందే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని గమనిస్తే ప్రమాదం తప్పించుకోవచ్చు.

తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం: తల బరువుగా అనిపించడం, తిప్పలు రావడం మొదటి సంకేతం.

అధిక అలసట, బలహీనత: శరీరంలో శక్తి తగ్గినట్టు అనిపిస్తుంది. చిన్న పని చేయడానికీ కష్టం అవుతుంది.

తీవ్ర‌ చెమట లేదా చెమట ఆగిపోవడం: కొందరికి ఎక్కువ చెమట వస్తుంది, కొందరికి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇవి రెండూ ప్రమాద సూచనలు.

నోరు ఎండిపోవడం, ఎక్కువ దాహం: డీహైడ్రేషన్ మొదలైన సంకేతం ఇది.

ఆందోళన, గందరగోళం: ఏ పని మీద దృష్టి పెట్టలేకపోవడం, మనసు అశాంతిగా ఉండటం.

శరీరం వేడిగా అనిపించడం: తేలికపాటి జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది.

35
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏమి చేయాలి?
Image Credit : our own

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏమి చేయాలి?

ఈ సంకేతాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకూడదు. వెంటనే ఎండ నుండి దూరంగా చల్లని ప్రదేశానికి వెళ్లాలి. నీరు లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలు తాగాలి, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు తడి గుడ్డతో తుడవాలి. ఏ ప‌ని చేస్తున్నా ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి. లక్షణాలు పెరిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

45
ఎండ‌దెబ్బ త‌గ‌ల‌కుండా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు
Image Credit : our own

ఎండ‌దెబ్బ త‌గ‌ల‌కుండా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు

కొన్ని సాధారణ అలవాట్లు పాటిస్తే వ‌డ‌దెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లడం తగ్గించాలి. తేలికపాటి, కాట‌న్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు తలపై క్లాత్ కప్పుకోవాలి. తరచూ నీళ్లు తాగాలి, ఎక్కువసేపు ఎండలో పని చేస్తే మధ్యలో విరామాలు తీసుకోవాలి.

55
హెల్తీ డ్రింక్స్ తీసుకోవాలి
Image Credit : our own

హెల్తీ డ్రింక్స్ తీసుకోవాలి

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు, గ్లూకోజ్ లేదా ORS ద్రావణాలు వంటివి తీసుకోవాలి. ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఎండ దెబ్బ‌కు చెక్ పెట్టొచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వాతావరణం
జీవనశైలి
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cockroaches: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఇదొక్కటి చేస్తే.. మళ్లీ ఇంట్లో బొద్దింకలు తిరగవు..!
Recommended image2
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image3
Mangalsutra Designs: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే మంగళసూత్రాలు
Related Stories
Recommended image1
బ‌య‌ట రూ. 1500 ఉండే మందు బాటిల్ ఆర్మీ క్యాంటీన్‌లో రూ. 600కే ఎందుకు ల‌భిస్తుందో తెలుసా.?
Recommended image2
Cooler: కూలర్ నీళ్లు ఎక్కడికి పోతాయి? ఏసీ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడైనా ఆలోచించారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved