బిజీ లైఫ్ స్టైల్ లో గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసా?
ప్రస్తుత కాలంలో చాలా మంది తీరిక లేని పనులతో బిజీబిజీగా సమయాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వారికే ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం పొంచి ఉంది.
ఒక వ్యక్తి ఎన్నో రకాల బరువు, బాధ్యతలను మోయాల్సి ఉంటుంది. ఒక పక్క చేసే పని, సామాజిక కట్టుబాట్లు, ఇతర పనులను సమతుల్యం చేయడానికి ఎంతో ప్రయత్నిస్తారు వీటితో పాటుగా మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఆరోగ్యంగా ఉన్నప్పుడే వంద పనులను ఎనర్జిటిక్ గా చేయగలుగతారు. అందుకే అన్నింటికంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.
heart health
కానీ నేడు చాలా మంది బీజీ లైఫ్ స్టైల్ నే లీడ్ చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇతర పనులపై పెట్టే ఇంట్రెస్ట్ ఆరోగ్యంపై పెట్టరు. ఎప్పుడూ ఒత్తిడి, సమయం లేకుండా గడపడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం..
heart health
ఆరోగ్యకరమైన స్నాక్స్
పని మధ్యలో ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తినడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా బాదం, వాల్ నట్స్ ను తినండి. ఇవి ఆరోగ్యకరమైనవి. ఇవి ఎంతకాలమైన పాడుకాకుండా ఉంటాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీసే చిప్స్, ఇతర పాకేజ్డ్ ఫుడ్ కు బదులుగా ఈ గింజలను తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
జంక్ ఫుడ్ ను తినడం మానుకోండి
జంక్ ఫుడ్ ను ఇష్టపడని వారుండరు. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటిలో పోషకాలు అసలే ఉండవు. దీనికి తోడు చక్కెర, ఉప్పు వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే వీటికి బదులుగా, ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి.
పరిమాణం కంటే నాణ్యతే ముఖ్యం
ఇంత ఎక్కువ ఫుడ్ ను తిన్నాము అన్న సంగతిని ఇప్పటి నుంచి పక్కన పెట్టండి. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని కొద్ది మొత్తంలో తిన్నా మీరు ఆరోగ్యంగా ఉంటారు. సేంద్రీయ వ్యవసాయంలో పండించిన ఆకు కూరలు, కూరగాయలను ఎక్కువగా తినండి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వ్యాయామం
మీరెంత బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్నా.. వ్యాయామం చేయడం మానకండి. శారీరక శ్రమే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. లేదంటే పొట్ట పెరిగి, శరీర బరువు పెరిగి సర్వ రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే గంటలకు గంటలు కూర్చోవడం వల్ల అవయవాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. రక్తం గడ్డకట్టడం, వాస్కులర్ రుగ్మతలు, నరాల సమస్యలు పెరుగుతాయి. అంతకాదు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, చిత్తవైకల్యం వంటి రోగాల ప్రమాదం కూడా పెరుగుతుంది.
మెట్లు ఎక్కండి
మెట్లు ఎక్కడం కూడా ఒక వ్యాయామమే. రోజూ కాసేపు మెట్లు ఎక్కి దిగడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. గుండె ఫిట్ గా ఉంటుంది. వ్యాయామం చేయడానికి మీకు సమయం లేకుంటే కనీసం మెట్లైనా ఎక్కండి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందది.
మద్యపానాన్ని తగ్గించండి
మితిమీరిన ఆల్కహాల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా రోజుకు రెండు సార్ల కంటే ఎక్కువ అసలే తాగకూడదు. ఇక మహిళలైతే ఒకటి కంటే ఎక్కువ పానీయాలను తాగనేకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరిగిపోతారు. అలాగే రక్తపోటు పెరిగే ప్రమాదం కూడా ఉంది. కొంతమందికైతే ఏకంగా గుండె జబ్బులే వస్తాయి. అందుకే ఆల్కహాల్ ను ఎక్కువగా తాగకూడదు.