ఒంట్లో బలం లేదా? అయితే వీటిని తినండి.. ఎనర్జీ లెవెల్స్ ఇట్టే పెరిగిపోతాయి..
మనం తినే ఆహారం ద్వారానే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అందుకే మనం తినే ఆహారాలు ఎక్కువ పోషకవిలువలు కలిగినవై ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ రెయినీ సీజన్ లో ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలు చుట్టుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే ఈ సీజన్ లో రోగ నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి రోగమైనా సోకే ప్రమాదం తప్పుతుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో చాలా తొందరగా అలసటకు గురవుతుంటారు. అయితే కొన్ని రకల ఆహారాలను శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెర్రీలు (Berries)
క్రాన్ బెర్రీలు, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, ఫోలెట్ వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. వీటి ద్వారా శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
సోయాబీన్స్ (Soybeans)
సోయాబీన్స్ లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. సోయా బీన్స్ ను , సోయా పాలు, టోఫు, టెంపే మొదలైన రూపాల్లో తీసుకోవచ్చు.
గింజలు (Nuts)
నట్స్ ను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఆ రోజంతా బాడీ యాక్టీవ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. గింజల్లో బాదం పప్పులు, వాల్ నట్స్, జీడిపప్పులు మొదలైనవి తింటే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
espressos
కాఫీ (Coffee)
కాఫీ ఎనర్జీ బ్యూస్టర్ గా పేరుగాంచింది. ఇతర ఆహార పదార్థాల మాదిరిగానే కాఫీ కూడా మన ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతుంది. తక్షణ శక్తి కోసం ఒక కప్పు కాఫీ తాగితే చాలు. కాఫీలో ఉండే కెఫిన్ యే ఎనర్జీని పెంచుతుంది. ఇది మెదడు పనితీరును కూడా మెరుగ్గా చేస్తుంది.
గ్రీన్ టీ (Green tea)
గ్రీన్ టీ బరును తగ్గించడానికే కాదు.. ఎనర్జీ లెవెల్స్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. కాఫీలో మాదిరిగానే దీనిలో కూడా కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తాగడం వల్ల జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. తక్షణ శక్తి కూడా లభిస్తుంది. ఇది మిమ్మల్ని మరింత హుషారుగా మారుతుంది.
సిట్రస్ పండ్లు (Citrus fruits)
సిట్రస్ పండ్లైన నిమ్మకాయ, నారింజల్లో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా సహాయపడతాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి ఒత్తిడిని తగ్గించి ఎనర్జీ లెవెల్స్ అమాంతం పెంచుతుంది. మలబద్దకం సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
చేపలు (Fish)
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ శరీరానికి ఎంతో శక్తిని అందిస్తాయని పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. అందుకే వీటిని తరచుగా తింటూ ఉండాలి.
అరటిపండ్లు (Bananas)
అరటి పండ్లను ఎనర్జీ బూస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అరటి పండ్ల ద్వారా మన శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్, చక్కెరలు మన ఎనర్జీని పెంచేందుకు ఎంతో సహాయపడతాయి.