MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బ్రేక్ ఫాస్ట్ లో ఆపిల్స్ ను తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

బ్రేక్ ఫాస్ట్ లో ఆపిల్స్ ను తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

రోజుకో ఆపిల్ పండును తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలుసు.. కానీ ఆరోగ్య నిపుణులు ఈ ఆపిల్ పండును మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తినాలని సలహానిస్తున్నారు. ఎందుకంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 04 2022, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పండ్లలో ఆపిల్ పండు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే దీన్ని రోజూ ఒకటి తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. అయితే ఈ పండును రోజులో ఎప్పుడో ఒకసారి కాకుండా.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లోనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. సాధారణంగా మన దేశంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఆయిలీ, అనారోగ్యకరమైన ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఆపిల్ పండును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆరోగ్యానికి మేలు చేసే ఆపిల్ పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల ధమనుల్లో ఫలకం ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. ధమనుల్లో ఫలకం కొరోనరీ ఆర్టరీ వ్యాధికి దారితీస్తుంది. ఆపిల్ తొక్కలో ఫినోలిక్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తుంది. అలాగే గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 

38

ఆపిల్ పండ్లను బ్రేక్ ఫాస్ట్ లో తింటే డయాబెటీస్, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. ఆపిల్ పండ్లు రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. 

48

ఉదయం వ్యాయామం చేసే అలవాటుంటే.. మీరు ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ లో ఆపిల్ పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామానికి ముందు ఒక ఆపిల్ పండును తింటే మీ స్టామినా పెరుగుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీంతో మీరు ఎలాంటి అలసట లేకుండా వ్యాయామాన్ని పూర్తిచేయగలుగుతారు. 

58

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు లేదా ఊబకాయం ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. బరువును తగ్గించుకోవాలనుకునే వారు బ్రేక్ ఫాస్ట్ లో ఆపిల్ పండును తింటే ప్రయోజనకరంగా ఉంటుంది.  ఎందుకంటే ఈ పండులో ఫ్యాట్ అసలే ఉండదు. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 

68

ఆపిల్ పండ్లలో ఎముకలను బలంగా చేసే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ కండ్లను  ఆరోగ్యాంగా ఉంచే విటమిన్ ఎ కూడా ఉంటుంది. దీనిలో ఉంటే ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. ఈ పండులో మన శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, విటమిన్ కె, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, సోడియం, ఇనుము, విటమిన్ బి1, బి6, బి9 లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

78

ఆపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్నికూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి  ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.

88

ఈ పండలో యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలుంటాయి. ఇవి నోట్లో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి. నోటి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకో యాపిల్ పండును తినాలని నిపుణులు సలహానిస్తున్నారు. ఆపిల్ పండ్లను తింటే దంతక్షయ ప్రమాదం తప్పుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Long Haaram: చీరల మీదకు ఒక్క లాంగ్ హారం ఇలాంటిది ఉంటే చాలు..!
Recommended image2
Mangalasutra Bangles: మంగళసూత్రాలకు జతగా మ్యాచింగ్ గాజుల డిజైన్లు
Recommended image3
Watch Bracelet: ట్రెండీ వాచ్ బ్రేస్లెట్స్.. ఎంత బాగున్నాయో చూడండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved