MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ పండుగవేళ పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారా? ఇదిగో ఈ చిట్కాలు మీ కోసమే..

ఈ పండుగవేళ పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారా? ఇదిగో ఈ చిట్కాలు మీ కోసమే..

ప్రతినెలా పీరియడ్స్ రావడం చాలా సహజం. అయితే కొంతమందికి నెలసరి పండగ సమయంలో రావొచ్చు. ఇక వీటిని ఆపేందుకు ట్యాబ్లెట్లను వేసుకుంటూ ఉంటారు. ట్యాబ్లెట్ల వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్స్ట్ ఉంటాయి. నిజానికి పీరియడ్స్ ను మందులు వేసుకోకుండానే పోస్ట్ పోన్ చేయొచ్చు. అదెలాగంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Oct 03 2022, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ప్రతి మహిళకు నెలసరి రావడం చాలా సహజం. ఒక్కొక్కరికి ఒక్కో తేదిన ఈ నెలసరి అవుతుంది. అయితే కొంతమందికి కిందటి నెల ఏ తేదీన అయ్యిందో.. వచ్చే నెలలో కూడా అదె రోజు కావొచ్చు. కానీ ఇంకొంత మందికి మాత్రం పోయిన నెలకు రెండు రోజుల ముందే లేదా ఆ తర్వాత కూడా కావొచ్చు. ఏదేమైనా రెండు మూడు రోజుల వ్యత్యాసంలో పీరియడ్స్ రావడం మాత్రం పక్కా. ఇక ఈ పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి, మూడ్ స్వింగ్స్, చిరాకు, ఒత్తిడి వంటి సమస్యలు సర్వసాధారణం. ఇక  ఈ నెలసరి సమయంలో దేవుడి గుడికి అసలే వెళ్లరు. అంతెందుకు ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరు. ముందే ఇది పండుగ సీజన్. ఈ సమయంలో నెలసరి కాకూడదని మందులను వాడే వారు చాలా మందే ఉన్నారు. 

26
periods

periods

కానీ ఈ మందులను వాడటం వల్ల కొన్ని కొన్ని సార్లు ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే హార్మోన్లలో హెచ్చు తగ్గులు వస్తాయి. అలాగే మీ పీరియడ్స్ టైం టేబుల్ కూడా మారుతుంది. నొప్పి కూడా ఎక్కువ అవుతుంది. అందుకే మందు బిల్లలకు బదులుగా .. నేచులర్ చిట్కాలను పాటించాలి. మందు బిల్లలు వేసుకోకుండా పీరియడ్స్ ను ఎలా పోస్ట్ పోన్ వేయాలో తెలుసుకుందాం పదండి. 

36

పీరియడ్స్ ను పోస్టో పోన్ చేయాలంటే కొన్ని రోజుల ముందు నుంచే స్పైసీ ఫుడ్ ను తినడం మానుకోవాలి. మిరపకాయలు, నల్ల మిరియాలు, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి. స్పైసీ ఫుడ్ రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీని వల్ల పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. స్పైసీ ఫుడ్ శరీరాన్ని వేడెక్కిస్తుంది. దీంతో రక్త ప్రవాహం పెరుగుతుంది. అందుకే పీరియడ్స్ ను పొడిగించాలంటే వారం నుంచే స్పైసీ ఫుడ్ ను తినడం మానుకోండి. 

46

పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేయడానికి నిమ్మరసం కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ పీరియడ్స్ ను వాయిదా వేయడానికి, రక్త ప్రవాహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం 2 నుంచి 3 టీస్పూన్ల నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. పీరియడ్ తేదీకి కొన్ని రోజుల ముందు నుంచి ఈ నిమ్మరసాన్ని తాగుతూ ఉండండి. 
 

56

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ బరువును తగ్గించడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది పీరియడ్స్ ను పోస్టో పోన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో 3 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి వారానికి మూడుసార్లు తాగండి.

66

అజ్వైన్ ఆకులు

అజ్వైన్ ఆకులు కూడా పీరియడ్స్ ను వాయిదా వేస్తాయి. ఇందుకోసం రెండు అజ్వైన్ ఆకులను తీసుకుని నీటిలో బాగా మరిగించి ప్రతిరోజూ రెండుసార్లు తాగితే పీరియడ్స్ రావడం ఆలస్యం అవుతుంది. ఇందులో విటమిన్ బి 12, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ లు ఉంటాయి. ఈ ఆకులు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Dandruff: చుండ్రుతో విసిగిపోయారా? ఈ చిట్కాలతో ఈజీగా వదిలించుకోండి
Recommended image2
Mango Recipe: శ్రీకాకుళం స్టైల్ మామిడి ముక్కలు, ఇలా చేస్తే ఏళ్ల పాటు పాడవు, రుచి కూడా డబుల్
Recommended image3
Gardening: ఈ మొక్కలు పెంచడానికి కొమ్మలు ఉంటే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved