ఆరోగ్యంగా ఉండాలంటే కిచెన్ లో ఉండే వీటిని తినకపోవడమే మంచిది..
వంటింట్లో ఉండే అన్ని పదార్థాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయనలేం. ఎందుకంటే కొన్ని ఆహారాలు మనకు అవసరం అయినప్పటికీ.. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అవేంటంటే..
salt
ఉప్పు
ఉప్పు మన శరీరానికి అవసరమైనప్పటికీ దీన్ని ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఉప్పు మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. మీరు తెలుపు ఉప్పుకు బదులుగా రాయి లేదా నల్ల ఉప్పును ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఉప్పు బీపీని పెంచుతుంది. ఈ బీపీ గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను పెంచుతుంది. అందుకే ఏదైనా ఆహారాన్ని వండేటప్పుడు లేదా తినేటప్పుడు పై నుంచి ఉప్పును వేయకూడదు.
Image: Getty Images
చక్కెర
తీపివంటకాలన్నింటిలో చక్కెరను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. తీపి నోటికి రుచిగా అనిపించినప్పటికీ.. చక్కెర మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే చక్కెర ను ఎక్కువగా తీసుకోవడం వల్ల బాగా బరువు పెరిగిపోతారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ పెరగడం మొదలవుతుంది. షుగర్ రక్తంలో మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే చక్కెర కు బదులుగా తేనెను వాడండి.
శుద్ధి చేసిన నూనె
శుద్ధి చేసిన నూనెలో ట్రాన్స్ ఫ్యాట్ చాలా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అందుకే ఇలాంటి వాటిని తీసుకోకపోవడమే మంచిది. రిఫైన్డ్ ఆయిల్ కు బదులుగా ఆవనూనె, ఆలివ్ ఆయిల్ ను వాడండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆకుపచ్చ బంగాళాదుంపలు
కొన్నిసార్లు బంగాళాదుంపలు తీసుకువచ్చినప్పుడు దానిలో కొన్ని ఆకుపచ్చ బంగాళాదుంపలు కూడా ఉంటుంటాయి. వీటిని కూడా వంటకోసం ఉపయోగిస్తుంటారు. కానీ పచ్చి బంగాళాదుంపలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి.
chilli powder
ఎండు మిరపకాయలు
ఎండు మిరపకాయలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఎండు మిరపకాయలకు బదులుగా పచ్చి మిరపకాయలను తినండి. చాలా మంది వంట చేసేటప్పుడు ఎరుపు రంగు బాగా రావడం కోసం ఎర్ర మిరపకాయలను కూడా ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
మైదా
శుద్ధి చేసిన పిండిని మైదా అని కూడా పిలుస్తారు. దీనిని సాధారణంగా ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. మైదాతో చేసిన కుకీలు, బిస్కెట్లు, బ్రెడ్, పాస్తా, మ్యాగీ, కేక్ మొదలైన వాటిని ప్రతిరోజూ తింటుంటారు. మైదాను ఎక్కువగా తింటే మలబద్దకానికి దారితీయడమే కాకుండా బరువు కూడా బాగా పెరుగుతారు. జీవక్రియ సమస్యలు వస్తాయి. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ కు దారితీస్తుంది.
ఒకే నూనెను పదేపదే ఉపయోగించడం
కొంతమంది పూరీలను, బజ్జీలను, బోండాలు మొదలైన ఆహారాలను వేయించడానికి ఎక్కువ నూనెను ఉపయోగిస్తారు. ఈ నూనెను ఇలా చాలా సార్లు ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ కుటుంబం అనారోగ్యానికి గురికావచ్చు. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్నిపెంచుతుంది. స్ట్రోక్, గుండెపోటు, మధుమేహం, బరువు పెరగడం, కీళ్ల నొప్పులు, అనేక రకాల క్యాన్సర్లు కూడా వస్తాయి.
వీటిని ఎలా తింటే మంచిది
ఉప్పు, చక్కెర, నూనె మొదలైన వాటిని పూర్తిగా తీసుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఇవి లేకుండా ఏ ఆహారాన్ని తయారు చేయలేం కాబట్టి. అయితే వీటిని ఉపయోగించినా పరిమితిలోనే వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు, పప్పుధాన్యాలలో ఉప్పు వేయండి. కానీ ఆహారంపై చల్లుకుని తినకూడదు. బెల్లం, తేనెలను చక్కెరకు బదులుగా ఉపయోగించొచ్చు. ప్రాసెస్ చేసిన పిండికి బదులుగా రాగి, గోధుమలతో చేసిన ఆహారాన్ని తీసుకోవచ్చు.