Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • స్మోకింగ్ చేస్తే కూడా వెన్ను నొప్పి వస్తుందా..?

స్మోకింగ్ చేస్తే కూడా వెన్ను నొప్పి వస్తుందా..?

కొన్ని చెడు అలవాట్ల వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుంది. అందుకే అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. 

Mahesh Rajamoni | Published : Sep 15 2022, 10:52 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
back pain

back pain

ప్రస్తుత కాలంలో రోగాలు లేని వ్యక్తులు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ చిన్నదో.. పెద్దదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. నిజం చెప్పాలంటే చాలా అనారోగ్య సమస్యలకు మన లైఫ్ స్టైల్ యే  ప్రధాన కారణం. అందుకే జీవనశైలిని మెరుగుపరుచుకుంటే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. 

27
Asianet Image

జీవనశైలి మెరుగ్గా లేకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్లో వెన్నునొప్పి ఒకటి. ఇతర కారణాల వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుంది. వ్యాయామం చేయకపోవడం, బరువును ఎక్కువగా ఎత్తడం, పని ఎక్కువగా చేయడం, అదే పనిగా ఒకో భంగిమలో కూర్చోవడం, కూర్చునే విధానం సరిగ్గా లేకపోవడం, ఊబకాయం వంటి వాటివల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. వెన్నునొప్పి తగ్గాలంటే ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం పదండి. 

37
Asianet Image

ఎక్కువ సేపు కూర్చోకూడదు..

ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది.  ఇలా గంటల తరబడి పనిచేసే వారు.. మధ్య మధ్యలో లేచి నడవడం.. నడుమును సాగదీయడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకు ఒకసారైనా నడుమును సాగదీయడం మంచిది.

47
Asianet Image

శరీరాన్ని నిటారుగా  ఉంచాలి

కూర్చున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు మీ శరీరం నిటారుగా ఉండేట్టు చూసుకోండి. మీ శరీరాన్ని మంచి భంగిమలో ఉంచేతేనే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు వెన్నక్కి వంగడం వంటివి చేయకూడదు. ఈ అలవాటు వల్ల కూడా వెన్ననొప్పి వస్తుంది. 
 

57
back pain

back pain

విటమిన్ల లోపం లేకుండా చూసుకోవాలి

ఎముకల బలహీనత వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. అందుకే ఎముకలను బలంగా చేసే కాల్షియం, విటమిన్ డిలు మీ శరీరంలో లోపించకుండా చూసుకోవాలి. ఇందుకోసం విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. 
 

67
Asianet Image

సిగరేట్

సిగరేట్ కు  వెన్ను నొప్పికి సంబంధం ఉందని పలు అధ్యయనాలు కూడా తేల్చేశాయి. ఎలా అంటే సిగరేట్లలో ఉండే నికోటిన్ రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది.  వెన్నెముకలోని డిస్క్ లకు రక్త ప్రవాహం కూడా ఇదే విధంగా నియంత్రించబడుతుంది. దీంతో వెన్ను నొప్పి పుడుతుంది. ఇదే కాకుండా శరీరంలోని ప్రతి భాగానికి పోషకాలు అందకపోవడం వల్ల కూడా రక్తప్రవాహం తగ్గుతుంది. ఇది కూడా వెన్నునొప్పికి కారణమవుతుంది. 

77
Asianet Image

బరువును అదుపులో ఉంచుకోవాలి

అధిక బరువు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారిస్తుంది. అందులో ఒకటి వెన్ను నొప్పి. శరీర బరువు ఎక్కువయ్యి వెన్నుపై ఒత్తిడి పడుతుంది. దీంతో వెన్ను నొప్పి వస్తుంది. అందుకే మీ బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఇందుకోసం ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను తినకూడదు.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
జీవనశైలి
 
Recommended Stories
Top Stories