అలసట, నీరసాన్ని తగ్గించే బెస్ట్ టిప్స్ మీకోసం..
పని ఎక్కువైతే అలసిపోవడం, నీరసపడిపోవడం సర్వ సాధారణం. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి చాలా సులువుగా బయపడతారు. అవేంటంటే..
Fatigue
లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అందులో పని ఎక్కువ అవడం వల్ల ఒంట్లో ఉన్న శక్తంతాపోయి.. నీరసంగా, అలసటగా కనిపిస్తారు. కొన్ని కొన్ని సార్లైతే ఏ పనిచేయకపోయినా అలసిపోతుంటారు. దీనికి కారణం మీ శరీరంలో విటమిన్లు లోపించడం. శరీరంలో విటమిన్లు లోపించడం వల్ల అలసట ఒక్కటే కాదు ఎన్నో శారీరక సమస్యలు కూడా వస్తాయి. దీనికి తోడు శీతల పానీయాలను తాగడం, తక్కువ కేలరీల ఫుడ్ ను తీసుకోవడం వల్ల కూడా అలసట కలుగుతుంది. ఈ అలసటకు ప్రధాన కారణం ఒత్తిడేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవసరాలను తీర్చుకోవడానికి శక్తికి మించి పనిచేస్తున్నారు. దీనివల్ల ఒంట్లో ఉన్న శక్తి అంతా పనిమధ్యలోనే అయిపోతుంది. దీనివల్ల బాగా అలసటకు గురవుతారు. మరి అలసట పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.
పౌష్టికాహారం తీసుకోవడం
అలసటను పోగొట్టడానికి పౌష్టికాహారం చాలా ఉపయోగపడుతుంది. శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు పోషకాహారం ద్వారా అందుతాయి. వీటితోనే శరీర శక్తి స్థాయిలు పెరగుతాయి. ఇందుకోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్, పాల ఉత్పత్తులను రెగ్యులర్ గా తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. మీ వయస్సు, మీ శరీర బరువు, చేసే పనులను బట్టి కేలరీలను తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకు మూడు పూటల భోజనం చేయడంతో పాటుగా నీళ్లను కూడా పుష్కలంగా తాగాలి. నీళ్లను తాగకపోతే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో మెదడు పనితీరు దెబ్బతింటుంది. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గుతాయి. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే శరీరానికి అవసరమయ్యే నీటిని ఖచ్చితంగా తాగాలి. అప్పుడే అలసట పోతుంది.
smoking
స్మోకింగ్, డ్రింకింగ్
స్మోకింగ్, డ్రింకింగ్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. స్మోకింగ్ అలసటను కలిగిస్తుంది. ఇక మద్యం తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. ఇది కాస్త నిద్రలేమికి దారితీస్తుంది. కంటి నిండా నిద్రలేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సిగరేట్ కాల్చేటప్పుడు వచ్చే పొగలోని టాక్సిన్ ఊపిరితిత్తులలో ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇది అలసటకు కారణమవుతుంది. స్మోకింగ్ మానేస్తేనే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలాగే సాధ్యమైనంత వరకు టీ, కాఫీ లను తాగడం తగ్గిస్తేనే మంచిది. ఇవి అప్పటి మందం ఎనర్జీ లెవెల్స్ ను పెంచినా.. తర్వాత బాగా తగ్గిస్తాయి.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పుల్ల పుల్లగా, తీయ తియ్యగా ఉండే స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండులో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. స్ట్రాబెర్రీలను రోజూ కొంత పరిమాణంలో తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఈ పండ్లు అలసటను పోగొట్టడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
గింజలు, గుడ్లు
గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. గింజల్లో కూడా అంతే. వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. మీరు అలసిపోయినట్టుగా అనిపిస్తే వెంటనే గింజలను తినండి. అలసట దూరం అవుతుంది. ఇవి క్విక్ ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తాయి. ఒక కప్పు గింజల్లో ప్రోటీన్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు, కొవ్వు ఆమ్లాల పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం కండరాల బలం పెరుగుతుంది. అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. గుడ్లు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్లను తినడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇది అలసటతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.