MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • నైట్ టైం పాలను తాగడం మంచిది కాదా..?

నైట్ టైం పాలను తాగడం మంచిది కాదా..?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 30 ఏండ్లు దాటిన వారు రాత్రి పూట రోజూ పాలను అస్సలు తాగకూడదు. ఎందుకంటే వీరిలో లాక్టోజ్ ఎంజైమ్ లోపముంటుంది. దీనివల్ల వీళ్లు పాలను అరిగించుకోలేరు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 16 2022, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రోటీన్ పుష్కలంగా ఉండే వనరుల్లో పాలు ఒకటి. అందుకే పాలను రోజూ తాగాలని డాక్టర్లు చెప్తుంటారు. పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది. అయితే పాల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నప్పటికీ.. పాలను 30 ఏండ్లు దాటిన వారు వీటిని తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎందుకంటే 30 ఏండ్లు దాటిన వారిలో లాక్టేజ్ ఎంజైమ్ ఉండదు. దీనివల్ల ఈ పాలను వీళ్లు సులువుగా అరిగించుకోలేరు. మన చిన్న పేగుల్లో లాక్టేజ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలను చాలా సులువుగా జీర్ణం చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ.. 5 సంవత్సరాలు పైబడినప్పటి నుంచి శరీరంలో లాక్టేజ్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. 
 

35

ఇక 30 ఏండ్ల వయసులో ఈ లాక్టేజ్ ఉత్తత్తి మొత్తమే ఆగిపోతుంది. మన శరీరంలో లాక్టేజ్ ఎంజైమ్ లేకుంటే.. పాలు నేరుగా పెద్ద పేగుల్లోకి వెళ్లిపోతాయి. అక్కడ ఉన్న బ్యాక్టీరియా వల్ల పాలు జీర్ణం కావు. అందుకే రాత్రి పడుకునే ముందు పాలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. జీర్ణ సమస్యలు లేకపోయినా.. రాత్రిళ్లు పాలను తాగితే నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

45

పాలను తాగడం వల్ల రాత్రిళ్లు హాయిగా పడుకుంటారు. ఎందుకంటే ఇది మంచి నిద్రకోసం మెలటోనిన్ న్ను ప్రోత్సహించడానికి సెరోటోనిన్ ను విడుదల చేస్తుంది. అందుకే గోరు వెచ్చని పాలను తాగితే హాయిగా పడుకుంటారని. అయితే రాత్రి పడుకునే ముందు పాలను తాగడం వల్ల ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే పాలలో ఉన్న కార్భోహైడ్రేట్లు సిర్కాడియన్ లయకు భంగం కలిగిస్తాయి. అందుకే పాలను పడుకునేటప్పుడే తాగకూడదు. పడుకోవడానికి రెండు లేదా మూడు గంటల ముందు పాలను తాగడం వల్ల పెద్దగా సమస్యలేం రావంటున్నారు  నిపుణులు. 
 

55

మొత్తం మీద పాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలు ఒక్క ఎముకలకే కాదు మన మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పాలలో కాల్షియంతో పాటుగా విటమిన్ డి, భాస్వారం మొదలైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముక నిర్మాణం, ఇతర జీవ విధులకు సహాయపడతాయి. 

పాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Curry Leaf: కుండీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కరివేపాకును పెంచండిలా
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Long Haaram: చీరల మీదకు ఒక్క లాంగ్ హారం ఇలాంటిది ఉంటే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved