MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • టాయిలెట్ లో 10 నిమిషాల కంటె ఎక్కువ సేపు ఉంటున్నారా? అయితే మీకు వ్యాధి రావడం ఖాయం..

టాయిలెట్ లో 10 నిమిషాల కంటె ఎక్కువ సేపు ఉంటున్నారా? అయితే మీకు వ్యాధి రావడం ఖాయం..

టాయిలెట్ లోకి మొబైట్ తీసుకెళ్లే వారు చాలా మందే ఉన్నారు. ఇక మొబైల్ ను చూస్తూ ఎంత సేపు టాయిలెట్ లో ఉంటారో వాళ్లకే తెలియదు. కానీ టాయిలెట్ లో 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంటే ఈ సమస్యలు రావడం పక్కా అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 30 2022, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పైల్స్ లేదా అర్షమొలల గురించి తెలియని వారుండరు. ఎందుకంటే ఈ సమస్య చాలా మందికి ఉంది. ఈ సమస్య ఉందని చెప్పుకోలేని రోగం ఇది. కొంతమంది దీని నొప్పి గురించి చెప్తే నవ్వుతారని తమలో తామే నలిగిపోతుంటారు. కానీ ఈ సమస్య వల్ల సరిగా కూర్చోవడం, నడవడం, పడుకోవడానికి కూడా కష్టంగానే ఉంటుంది. అయితే పైల్స్ కు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ నొప్పి పైల్స్ కంటే ఎక్కువుంటుంది. అందులోనూ శస్త్ర చికిత్స చేయించుకున్నా పైల్స్ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అందుకే చాలా మంది శస్త్ర చికిత్సను చేయించుకోరు. కానీ మనకున్న  అలివాట్లు కొన్ని పైల్స్ బారిన పడేలా చేస్తాయి. అందులో ఒకటి టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చోవడం. ఇది సిల్లీగా అనిపించినా ముమ్మాటికీ నిజం అంటున్నారు నిపుణులు. 
 

24

పైల్స్ అంటే ఏమిటీ?

హేమోరాయిడ్స్ లేదా సాధారణ పరిభాషలో పైల్స్ అంటారు. మీ పాయువు, దిగువ పురీషనాళంలో వెరికోస్ సిరల మాదిరిగానే వాపు సిరలు ఉంటాయి. హేమోరాయిడ్స్ (మొలలు) పురీషనాళం లోపల లేదా పాయువు చుట్టూ చర్మం కింద అభివృద్ధి చెందుతాయి. మల లేదా మూత్ర విసర్జన సమయంలో ఒత్తిడి చేస్తే బయటకు కూడా వస్తాయి. కొన్నిసార్లు మొలల నుంచి రక్తం కూడా వస్తుంది. 
 

 

34

మీరు టాయిలెట్ లో 10 నిమిషాల కంటే సమయంలో ఉన్నట్టైతే మీకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కమోడ్ మీద ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులకు హేమోరాయిడ్స్ ఉండవచ్చు. ఎందుకంటే మీరు కమోడ్ మీద ఎక్కువసేపు కూర్చుంటే.. మీ బట్ (పిరుదుల) చుట్టూ ఒత్తిడి ఎక్కువ పడుతుంది. దీని వల్ల పురీషనాళ సిరల్లో ఎక్కువ రక్తం పేరుకుపోతుంది. ఇది పైల్స్ కు దారితీస్తుంది. అందుకే టాయిలెట్ లో 10 నిమిషాలకు మించి ఎక్కువ సేపు కూర్చోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు టాయిలెట్ నుంచి త్వరగా బయటకు రావాలి. దీనితో పాటుగా టాయిలెట్ కు వెళ్లినప్పుడు ఎక్కువ ఒత్తిడి చేయడం వల్ల రక్తనాళాల్లో వాపు, హేమోరాయిడ్స్ (మొలలు) ఏర్పడతాయి.

44
piles

piles

హేమోరాయిడ్స్ లక్షణాలు

చాలా సందర్భాల్లో అర్షమొలల లక్షణాలు తీవ్రంగా ఉండవు. వాటంతట అవే నయం అవుతాయి. కానీ ఈ సమస్య ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

 పాయువు చుట్టూ దురద, అసౌకర్యం 

మలంలో రక్తస్రావం 

మలం దగ్గర గాయాలు ఏర్పడతాయి

మొలలు మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. నొప్పి కూడా విపరీతంగా ఉంటుంది. 

ఈ సమస్య ఎక్కువైతే నిల్చోలేరు, కూర్చోలేరు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి
Recommended image2
Smart Kitchen Hack: రోజూ ఒకే ఫుడ్ తో బోర్ కొడుతుందా? మీకోసమే కొన్ని క్రియేటివ్ కుకింగ్ ఐడియాలు
Recommended image3
Dark Circles: ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ మాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved