రోజుకు రెండు సార్లు జిమ్ కు వెళ్తున్నారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..
ఫిట్ గా ఉండేందుకు గంటల తరబడి జిమ్ముల్లో కసరత్తులు చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కొంతమంది రోజకు ఒకసారే జిమ్ కు వెళితే.. మరికొంతమంది మాత్రం రెండుసార్లు వెళుతుంటారు. రెండు సార్లు వెళ్లడం ఆరోగ్యానికి మంచిదేనా?

శరీరం ఫిట్ గా, అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతారు. ఇందుకోసం వర్కౌట్లు, రెగ్యులర్ గా యోగా చేస్తుంటారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. వ్యాయామం మీ శరీరాన్ని బలంగా చేయడమే కాదు.. అవయవాల పనితీరును మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు వ్యాయామం బరువు తగ్గేందుకు సహాయపడుతుంది కూడా. వ్యాయామం శరీర బలాన్ని పెంచుతుంది. అలాగే మెదడు రుగ్మతలను అధిగమించడంలో సహాయపడుతుంది. అయితే కొంతమంది రోజుకు ఒకసారి జిమ్ కు వెళితే.. మరికొంతమంది మాత్రం రోజుకు రెండు సార్లు జిమ్ కు వెళుతుంటారు.? రోజుకు ఒక సారి జిమ్ కు వెళ్లడం మంచిదా? రెండు సార్లు వెళ్లడం మంచిదా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇపుుడు తెలుసుకుందాం..
రోజుకు రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిదేనా?
రోజుకు రెండుసార్లు వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోజుకు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తే.. ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కానీ రోజుకు రెండు పూటలా వ్యాయామం చేస్తే.. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. దీనివల్ల అలసట ఎక్కువ అవడంతో పాటుగా కేలరీలు కూడా ఎక్కువగా కరిగిపోతాయి. దీంతో మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. అంతేకాదు ఇది మీరు రాత్రిళ్లు హాయిగా పడుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫిట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో రోజుకు ఒకసారి జిమ్ కు వెళ్లడం మంచిదే. అయితే రోజుకు రెండుసార్లు జిమ్ కు వెళ్లే అలవాటు ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల బాగా అలసిపోతారు. కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. గాయలు కూడా అవుతాయి.
కండరాల రికవరీకి సమయం సరిపోదు
రోజుకు రెండుసార్లు వ్యాయామం చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ప్రతి ఒక్కరికీ రెండు పూటలా వ్యాయామం అవసరం లేదు. రోజుకు రెండుసార్లు వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం బాగా అలసిపోతుంది. ఇది మాత్రమే కాదు దీనివల్ల మీ కండరాల రికవరీకి తగినంత సమయం సరిపోదు. అందుకే తర్వాతి రోజు మీరు బాగా అలసిపోతారు.
వర్కవుట్ సెషన్ ల మధ్య ఎంత గ్యాప్ ఇవ్వాలి;
ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామ సెషన్ల మధ్య ఆరు గంటల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ఈ సమయంలో నీటిని పుష్టిగా తాగాలి. శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. ఆ తర్వాత సెషన్ కోసం శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి కొంతసేపు నిద్రకూడా పోవాలి.
ఆరోగ్యం బాగుండేందుకు ఉదయం వ్యాయామం చేయడం మంచి అలవాటు. ఏరోబిక్ వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అయితే అతిగా వర్కౌట్స్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడం మర్చిపోకూడదు.