- Home
- Life
- శరీరంలో ఇక్కడ నెయ్యి రాస్తే.. ఎముకలు బలంగా అవ్వడమే కాదు.. ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి తెలుసా..
శరీరంలో ఇక్కడ నెయ్యి రాస్తే.. ఎముకలు బలంగా అవ్వడమే కాదు.. ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి తెలుసా..
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నెయ్యి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా నెయ్యిని అరికాళ్లకు రాయడం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

నెయ్యిని వివిధ రకాల కూరల్లో, వంటల్లో వేస్తుంటారు. నెయ్యి వల్ల వంటలు టేస్టీగా అవుతాయి. అంతేకాదు నెయ్యి మన ఎంతో ఆరోగ్యానికి కూడా ప్రయోజకరంగా ఉంటుంది. కొంతమంది నెయ్యిని వేడి వేడి అన్నం పచ్చడితో కలిపి తింటే.. ఇంకొంతమంది రొట్టెలో కూడా తింటుంటారు. నిజానికి అరికాళ్లకు నెయ్యిని రాయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం నెయ్యిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి..
రాత్రిపూట నిద్రపోయే ముందు మీ అరికాళ్లకు, వేళ్లకు రెండు చుక్కల దేశీ నెయ్యిని అప్లై చేసి మెళ్లిగా మసాజ్ చేస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా శీతాకాలంలో అరికాళ్లకు నెయ్యిని రాయడం వల్ల జలుబు, దగ్గు, నిద్రలేమి, కీళ్ల నొప్పులు వంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అరికాళ్లకు నెయ్యిని రాయడం కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి..
ghee
పాదాల అరికాళ్లకు నెయ్యిని అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. రోజూ ఇలాగే చేస్తే.. పనులు చేయడం వల్ల కలిగే అలసట కూడా తగ్గిపోతుంది. దీనికోసం.. ఒక టీ స్పూన్ దేశీ నెయ్యిని తీసుకుని కాస్త గోరు వెచ్చగా చేయండి. దీన్ని నిద్రపోయే ముందు మీ అరికాళ్లకు, వేళ్లపై అప్లై చేసి మసాజ్ చేయండి.
గురక సమస్యను వదిలించుకోవడానికి కూడా నెయ్యి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం పడుకునే ముందు మీ పాదాలకు నెయ్యిని రాయండి. దీనివల్ల వల్ల గురక వచ్చే అవకాశాలు తగ్గుతుంది.
అరికాళ్లకు నెయ్యిని రాయడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, వంటి వ్యాధులు తగ్గిపోతాయి. కాలాలు మారుతుంటే ఇలాంటి సమస్యలు రావడం చాలా కామన్. ఇలాంటి సమస్యలు రాకూడదంటే.. నెయ్యిని గోరు వెచ్చగా చేసి.. అరికాళ్లకు రాయండి. దీని వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. అరికాళ్లకు నెయ్యిని పూయడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. అలాగే వెన్ను నొప్పి తగ్గుతుంది. కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది.
రోజూ అరికాళ్ళను నెయ్యితో మర్దనా చేయడం వల్ల పాదాల ఎముకలు బలంగా మారతాయి. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కూడా కూడా నెయ్యి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పుల్లని త్రేన్పులు, ఎసిడిటీ, గ్యాస్ మొదలైన సమస్యలున్నట్టైతే.. ప్రతిరోజూ నిద్రపోయే ముందు అరికాళ్లపై నెయ్యికి అప్లై చేయాలి.
అరికాళ్లను నెయ్యిని అప్లై చేయడం వల్ల వాపు తగ్గుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా పాదాలలో వాపు వస్తుంది. ఇలాంటి వారు కాళ్లకు నెయ్యిని అప్లై చేయడం వల్ల వాపు తగ్గిపోతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మాత్రమే కాదు మడమల పగుళ్లను తగ్గిస్తుంది. నెయ్యిలో ఉప్పు కలపడం వల్ల చీలమండల పగుళ్లు తగ్గిపోతాయి.