MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health Tips:బాడీ వీక్ గా ఉన్నట్టు అనిపిస్తోందా? చిన్న చిన్న పనులను కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నారా?

Health Tips:బాడీ వీక్ గా ఉన్నట్టు అనిపిస్తోందా? చిన్న చిన్న పనులను కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నారా?

Health Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోతున్నారు. కారణం వారి శరీరం బలహీనంగా ఉండటమే. పాతికేళ్ల వయస్సు వారు కూడా బలహీనంగా ఉండటం గమనార్హం. దీనికంతటికీ అసలు కారణం శరీరానికి కావాల్సిన పోషకవిలువలు లభించకపోవడం, స్మోకింగ్ చేయడం వల్ల కూడా ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 04 2022, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Health Tips: ఒకప్పుడు మన పెద్దలు ఎంతో బలవంతులుగా ఉండేవారు. కొండలైనా.. ఇట్టే విరగొట్టే శక్తిని కలిగుండేవారు. మనం వారిలా ఎంత బలంగా ఉన్నామా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే.. చిన్న చిన్న పనులను చేసినా.. వామ్మో ఇక నా వల్ల కాదు బాబోయ్ అంటూ చేయాల్సిన పనులను పక్కన పెట్టేస్తుంటారు. దీనికంతటికి అసలు కారణం.. మన శరీరం బలహీనంగా ఉండటమే. దీని కారణంగానే వారు చిన్న చిన్న పనులను సైతం చెయ్యలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది హాస్పటల్ల చుట్టూ తిరుగుతూ.. రకరకాల మందులు, టానిక్ లు తీసుకుంటున్నారు. ఈ మెడిసిన్స్ వల్ల పెద్దగా ప్రయోజనం జరుగదు. కానీ మన ఇంట్లో లభించే కొన్నిరకాల ఆహార పదార్థాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

27


గుడ్లు: గుడ్లలో ఎన్నో పోషకవిలువలుంటాయి. అంతేకాదు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందు ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్లను తినాలి. ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. క్రమం తప్పకుండా గుడ్లను తినడం వల్ల ఒంట్లో సత్తువ కూడా అమాంతం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

37

మొలకలు: మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాదు వీటిల్లో మెగ్నీషియం కూడా మెండుగా ఉంటుంది. ఇవే శరీరానికి శక్తిని చేకూరుస్తాయి. అందుకే మీ రోజు వారి ఆహారంలో బీన్స్, పనీర్, మొలకలు వంటివి ఉండేలా చూసుకోవాలి. 

47

ఓట్స్: బలహీనత సమస్య నుంచి బయటపడేయడంలో ఓట్స్ ముందుంటాయి. అందుకే ప్రతిరోజూ మీ ఆహారంలో ఓట్ మీల్ ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటుగా పాలు తీసుకుంటే కూడా చక్కటి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ తీసుకుంటే కూడా శరీరానికి కావాల్సిన పిండి పదార్థాలు అందుతాయి. ఇవి మనల్ని శక్తివంతంగా ఉంచుతాయి. 

57

అరటి పండు: అరటి పండులో విటమిన్లు, పొటాషియం, మినరల్స్ మెండుగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఈ పండును ఏ రూపంలో తీసుకున్నా.. మనకు కావాల్సిన ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. ఒకవేళ మీకు ఈ పండును తినాలని లేకుంటే.. దీన్ని మిల్క్ షేక్ చేసుకుని కూడా తాగొచ్చు. కాగా ఈ పండు మన శరీర శక్తి స్థాయిని కూడా పెంచుతుంది. 

67

డ్రై ఫ్రూట్స్: శరీర బలహీనత సమస్యకు చెక్ పెట్టడంలో డ్రై ఫ్రూట్స్ ఎంతో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజూ మీ రోజు వారి ఆహారంలో సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. చియా గింజలు, బాదం, గుమ్మడి గింజలు, పిస్తాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటుగా.. పోషకాలు కూడా పుష్కలంగా కూడా లభిస్తాయి. 
 

77

నీళ్లు: మన శరీరానికి కావాల్సిన నీరుంటే .. సర్వరోగాల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. బాడీకి కావాల్సిన నీరు అందకపోతే కూడా శరీరం బలహీనంగా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీ శరీరానికి కావాల్సిన నీళ్లను తాగుతూ ఉండాలి. దీనివల్ల మీరు డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అంతేకాదు బ్లాక్ టీ, గ్రీన్ టీ లు తాగినా కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Recommended image2
Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు
Recommended image3
Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved