Health Tips: వర్షకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని ఖచ్చితంగా తినాలి
Health Tips: రెయినీ సీజన్ ను ఎంజాయ్ చేయాలంటే మీ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారమే తీసుకోవాల్సి ఉంటుంది.

వర్షాకాలంలో వేడి వేడి టీ తో పాటుగా పకోడి లేదా బజ్జీలను తినడానికి నోరు ఉవ్విళ్లూరుతుంది. అందుకే వర్షం పడ్డప్పుడల్లా ఇలాంటి వాటినే ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ ఇవి వర్షాకాలంలో తినడం ఏ మాత్రం మంచిది కాదు. ఈ ఫుడ్స్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే ఇలాంటి ఆహారాలను తినడం మానేసి.. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఆయిలీ ఆహారాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆహారాలను బరువు తగ్గాలనుకునేవారికి ఏమాత్రం మంచివి కావు.
వర్షాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం, వైరల్ ఫీవర్ వంటి ఎన్నో రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. రోగనిరోధక శక్తే సంక్రమణను నిరోధిస్తుంది. మరి ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే పాలు, చక్కెర కలిపిన టీ కి బదులుగా లెమన్ టీన్ తాగండి. ముఖ్యంగా ఈ సీజన్ లో వేయించిన ఆహారాలను తినకూడదు. ఇంతకీ సీజనల్ వ్యాదులు రాకుండా ఉండాలంటే ఏయే ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పోషకాహార నిపుణురాలైన స్మితా శెట్టి గారు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలేంటో తెలియజేసారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Popcorn
పాప్ కార్న్ (Popcorn)
బటయ చేసిన పాప్ కార్న్ ల కంటే ఇంట్లోనే తయారుచేసుకునే పాప్ కార్న్ లే ఆరోగ్యానికి మంచివి. కొంచెం నల్ల ఉప్పు, వైట్ బటర్ తో పాప్ కార్న్ ను రెడీ చేస్తే సూపర్ టేస్టీగా తయారవుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా. పాప్ కార్న్ ఒక తృణధాన్యాలు. కాబట్టి ఇది మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు వంటి రోగాల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. దీనిలో ఫినోలిక్ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్.
బ్లాక్ జామూన్ (Black Jamun)
Wild purple లేదా Black Jamun ను వర్షాకాలంలో తింటే ఎంతో మంచి జరుతుంది. దీనిలో ఔషదగుణాలు దాగుంటాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన పదార్థాలు కడుపు నొప్పి, విరేచనాలు, గుండె, కీళ్ల నొప్పులు, ఆస్తమా, పేగు తిమ్మిరి వంటి ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది. అందుకే వీటిని పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇవి కిడ్నీల ద్వారా శరీరంలో ఉండే మలినాలను బయటకు పంపేందుకు ఎంతగానో సహాయపడతాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఉసిరికాయ (Amla)
ఉసిరిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉసిరికాయను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వర్షకాలంలో ఎన్నో అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఒకవేళ శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్టైతే.. సీజన్ రోగాలను చుట్టుకునే ప్రమాదం ఉంది. ఉసిరి కాయ కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మిమ్మల్ని నిత్య యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.
లెమన్ టీ (Lemon tea)
లెమన్ టీలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా కడుపు ఉబ్బరం, ఆందోళన వంటి ఎన్నో సమస్యలను చిటికెలో తగ్గిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అనేక అంటువ్యాధులను నివారించడానికి ఇది సహాయపడుతుంది.