MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఇదెంత డేంజరో తెలుసా..?

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఇదెంత డేంజరో తెలుసా..?

మన దేశంలో చాలా మంది ఒకరోజు అన్నం తినకుండానైనా ఉంటారు కానీ ఒకపూట టీ లేకుండా ఉండలేకపోతుంటారు. టీని ఎప్పుడో ఒకసారి తాగితే ఆరోగ్యానికి ఏం కాదు. కానీ కప్పులకు కప్పులు టీ తాగితే  మాతకనం గ్యాస్ట్రిక్ నుంచి నిద్రలేమి వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా టీ తాగిన వెంటనే నీళ్లను తాగితే లేనిపోని సమస్యలు వస్తాయి జాగ్రత్త..   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Nov 17 2022, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏదో ఒక వంక చూసుకుని అర్ధరాత్రి నిద్రలేచి టీ తాగే వారు కూడా ఉన్నారు. చాలా మంది ఒకపూట అన్నం లేకుండానైనా ఉంటుంటారు కానీ.. టీ లేకుండా మాత్రం అస్సలు ఉండలేకపోతుంటారు. నిజానికి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు టీని పొద్దున్న ఒక్కపూటే తాగేవారు. కానీ ఇప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అంటూ ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తున్నారు. వెదర్ కూల్ గా ఉందని, చుట్టాలు వచ్చారని, నెత్తి నొప్పి లేస్తుందని, ఒత్తిడి తగ్గించుకోవాలని.. ఇలా ప్రతి సందర్భాన్ని అవకాశంగా తీసుకుని టీలను తాగేస్తున్నారు. కొంతమందికైతే టీ తాగనిదే ఏ పనీ చేయరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టీని రోజుకు ఒకసారి తాగితేనే మంచిది. అంతకు మించి తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. 

27

కొంతమంది టీ తాగిన వెంటనే నీళ్లను తాగేస్తుంటారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. టీ తాగిన తర్వాత నీళ్లను తాగడం టీ కంటే ఎక్కువ హానికరం. టీలో కెఫిన్ ఉంటుంది. టీ తాగిన వెంటనే దాహం కావడానికి  ఇదే కారణం. ఒక కప్పు టీలో 50 మి.గ్రా కెఫిన్ ఉంటుంది. టీ ని ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్రానికి వెల్లాల్సి వస్తుంది. ఇది దాహాన్ని పెంచుతుంది. అసలు టీ తాగిన వెంటనే నీళ్లను తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

37

దంతాల సమస్య

వేడివేడి ఆహారాన్ని తీసుకుని ఆ తర్వాత చల్లటి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మన నోటిని ప్రభావితం చేస్తుంది. వేడి టీ తాగిన తర్వాత నీళ్లను తాగడం వల్ల మీ దంతాలు దెబ్బతింటాయి. నోటి ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు వల్ల దంతాల నరాలు దెబ్బతింటాయి. 
 

47
ulcer

ulcer

అల్సర్లు

టీ తాగిన వెంటనే నీటిని తాగడం వల్ల అల్సర్ల ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కొంతమందికి టీ తాగిన వెంటనే కడుపులో గ్యాస్ రిలీజ్ అవుతుంది. దీనిని తగ్గించేకోవడానికి నీళ్లను ఎక్కువగా తాగేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కడుపులో అల్సర్ల సమస్య వస్తుంది. 
 

57

ముక్కు నుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం

టీ తాగిన తర్వాత నీళ్లను తాగడం వల్ల ముక్కు నుంచి రక్తం కారే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం ఒకేసారి చలి, వేడి.. రెండింటినీ తట్టుకోదు. దానికి సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుంది. వేసవిలో టీ తాగి తర్వాత నీళ్లను తాగితే రక్తస్రావం సమస్య ఎక్కువగా ఉంటుంది.
 

67

గొంతునొప్పి

వేడి వేడి టీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి టీ తాగిన వెంటనే నీటిని ఎట్టి పరిస్థితిలో తాగకండి. టీ తాగిన అరగంట తర్వాత మాత్రమే నీటిని తాగండి. అప్పుడే మీకు ఇలాంటి సమస్యలు రావు. 
 

77

టీకి ముందు నీటిని తాగడం మంచిదా? 

టీ తాగిన తర్వాత నీటిని తాగడానికి బదులుగా టీని తాగే ముందే నీటిని తాగండి. ఇదే మీ ఆరోగ్యానికి మంచిది. టీ చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యను పెంచుతుంది. టీ తాగే ముందు నీటిని తాగితే  గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది. ముందు నీళ్లు తాగి తర్వాత టీని తాగితే అసిడిటీ, క్యాన్సర్, అల్సర్లను తగ్గించవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి. కడుపులోని ఆమ్లాన్ని బలహీనపరచడానికి నీరు సహాయపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sharbat: నిమ్మకాయ లేకుండా కమ్మని షర్బత్ ఇలా చేసేయండి..!
Recommended image2
Kewra Plant: పాములకు ఈ మొక్కంటే ప్రాణం.. కానీ ఆ సమస్యకు ఇదే రామబాణం!
Recommended image3
Gold Rings: 2 గ్రాముల్లో స్టైలిష్ కొరియన్ ఉంగరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved