ఎండాకాలంలో దాహార్తిని తీర్చుకోవడానికి లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం. నిమ్మరసం, నీరు, పంచదార, ఉప్పు కలిపి ఈ షర్బత్ తయారు చేస్తారు.
నిమ్మకాయ అందుబాటులో లేకపోతే మీరు ఈ సమ్మర్ లో ఈజీగా దొరికే పచ్చి మామిడి కాయతో కమ్మనైన షర్బత్ తయారు చేసుకోవచ్చు.
ముందుగా మామిడికాయపై తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. తర్వాత ఈ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ జ్యూస్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్‌తో వడకట్టుకోవాలి.
ఈ రసాన్ని మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వాడుకోవచ్చు.
ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్న ఈ పచ్చి మామిడి రసంతో షర్బత్ చేసుకోవచ్చు. నిమ్మకాయ ప్లేస్ లో దీనిని వేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.
Potato: ఆలుగడ్డ తొక్కతో సహా తింటున్నారా? ఈ విషయం మీకు తెలుసా?
Apple: యాపిల్ పై మైనం పూత ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
Cooking Oil: వంటకు బెస్ట్ నూనె ఇదే
Banana: పరగడుపున అరటిపండు తింటే ఏమౌతుంది?