MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health Tips: మూత్రాన్ని ఆపుకుంటున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలుసా?

Health Tips: మూత్రాన్ని ఆపుకుంటున్నారా? ఇది ఎంత ప్రమాదమో తెలుసా?

Health Tips: స్కూళ్లకు వెళ్లే పిల్లల నుంచి .. పెద్దవారి వరకు ఏదో ఒక కారణం చేత మూత్రాన్ని వాయిదా వేస్తుంటారు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న సంగతి మీకు తెలుసా.. మూత్రాన్ని చాలా సేపు ఆపుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 10 2022, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Health Tips: కొన్నింటిని అస్సలు ఆపుకోకూడదు. వాటిని వాయిదా వేయడం వల్ల మనం ఎన్నో అనార్థాలను చవిచూడాల్సి వస్తది. ముఖ్యంగా మూత్రాన్ని. అవును మూత్రం వచ్చినప్పుడే పని కానియ్యకపోతే ఎన్నో సమస్యలను తప్పక ఫేస్ చేయాల్సి వస్తదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా మూత్రాన్ని వాయిదా వేయడం అసాధ్యం. కానీ చాలా మంది దీన్ని కూడా వాయిదా వేసేస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్కూళుకు వెళ్లే పిల్లలకు మూత్రం వచ్చినా.. టీచర్ ఏమనుకుంటుందోనని లేకపోతే పిల్లలు నవ్వుతారనే కారణం చేత టీచర్లకు చెప్పకుండా అలాగే వాయిదా వేస్తున్నారు. ఇక పెద్దల విషయానికొస్తే.. కొతమంది ఏదో ఒక కారణం చేత మూత్రం వచ్చినా.. ఆ పనిని వాయిదా వేస్తున్నారు. ఇది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదైతే కాదు కదా.. వచ్చినప్పుడే కానిచ్చేయాలి. కానీ చాలా మంది దీనిని కూడా ఆపుకుంటున్నారు. ఈ మూత్రం మన శరీరంలో ఉన్న మలినాలన్నింటిని బటయకు పంపే ద్రవ పదార్థం. ఎప్పటికప్పుడు ఈ మలినాలను బయటకు పంపకపోతే ఎలా? ఇది అస్సలు మంచి పద్దతి కానే కాదు. ఇలాచేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో తెలుసుకుందాం పదండి..
 

26

సాధారణంగా మన మూత్రాశయంలో 400 నుంచి 600 మిల్లీలీటర్ల వరకు మూత్రం ఉండగలదు. ఈ పరిమితి దాటితే మూత్రాశయం (Bladder) ఒత్తిడి పెరగడం మొదలవుతుంది. అంతేకాదు ఆ మూత్రాన్ని విసర్జించకుండా అలాగే ఆపుకుంటూ పోతే మూత్రాశయ పరిమాణం ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. ఇలా పెరగడం వల్ల దీని నుంచి మెదడుకి సంకేతాలు తక్కువ మొత్తంలోనే అందుతాయి.

36

ఈ కారణంగా మూత్రం విసర్జన చేసే సమయం మించిపోవచ్చు. అలా ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపడం వల్ల మన శరీరంలో ఎక్కువ మలినాలు ఉంటాయి. అంతేకాదు ఇలా చేయడం వల్ల యూరిన్ లోని కొన్ని రకాల పదార్థాలు జిగటగా మారే అవకాశం ఉంటుంది.  ఆ జిగట చిన్న చిన్న రాళ్లుగా మారతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినా మూత్రాన్ని ఇంకా ఎక్కువ సేపు ఆపి ఉంచితే.. చిన్న చిన్న రాళ్ళు కాస్త పెద్ద సైజులోకి  మారతాయట. 
 

46

ఎంత ఎక్కువ సేపు మూత్రాన్నిఆపి ఉంచితే రాళ్లు కూడా అంతగా పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే యూరిన్ ను వాయిదా వేయడం వల్ల కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని వైద్యలు తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే మగవారు ఎక్కువ శాతం మూత్రాన్ని ఆపుకోరు. ఎక్కడ పడితే అక్కడ పోస్తారు. అదే ఆడవారు ఇలా చేయలేరు కాబట్టి వీరే ఎక్కువగా యూరిన్ ను ఆపుతూ అనేక సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. 

56

కాగా ఇలా మూత్రం ఆపి ఉంచడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్య కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలోనే వస్తుందట. ఈ సమస్య వల్ల వారు మాటిమాటికి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అంతేకాదు ఆ సమయంలో మంటగా కూడా అనిపిస్తుంది. కాగా ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారికి మూత్రాశయం ఖాళీగా ఉన్నా.. మూత్రం వస్తున్నట్టుగా అనిపిస్తుందని వైద్యలు చెబుతున్నారు. 

66

అయితే  ఈ ఇన్ఫెక్షన్ సమస్య మరింత తీవ్రతరమైతే.. మూత్రంలో రక్తం కూడా వచ్చే ప్రమాదముంది. అలాగే తీవ్రమైన వెన్నునొప్పి, జ్వరం వంటి అనేక సమస్యలు చుట్టుముడతాయి. అందుకే మూత్రం వచ్చినప్పుడు అప్పుడే ఆ పనిని కానిచ్చేయాలి. బస్సుల్లో దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు మూత్రం వస్తే.. మొహమాట పడకుండా డ్రైవర్ కు చెప్పి బస్ ను ఆపించడంలో మీరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదముంది కాబట్టి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss: రోజూ ఈ డ్రింక్స్ తాగినా బరువు తగ్గొచ్చు
Recommended image2
చిన్నారుల కోసం లేటెస్ట్ డిజైన్ వెండి బ్రేస్‌లెట్స్.. చూసేయండి
Recommended image3
క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved