MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Salt Water Bath: నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే ఇన్ని లాభాలా? అయితే చేయాల్సిందే

Salt Water Bath: నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే ఇన్ని లాభాలా? అయితే చేయాల్సిందే

Salt Water Bath: బకెట్ నీటిలో ఉప్పు వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతోంది వాస్తు శాస్త్రం. మానసిక, శారీరక ఒత్తిడిని తట్టుకునే శక్తి  వస్తుందట. అంటే ఇంట్లో, శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని చెబుతోంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 05 2026, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవాలి
Image Credit : Getty

నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవాలి

జీవితంలోని కొన్ని కష్టాలు రావడానికి నెగిటివ్ ఎనర్జీ కారణంగా చెప్పుకోవాలి. మన చుట్టూ ఉండే కొన్ని వస్తువులు నెగెటివ్ ఎనర్జీని పెంచేస్తాయి. అయితే కొన్ని వస్తువుల ద్వారానే ఆ నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. మనం ఇంట్లోంచి మాత్రమే కాదు మన శరీరం నుంచి కూడా నెగెటివ్ ఎనర్జీని తొలగించే ఛాన్స్ ఉప్పు వల్ల దక్కుతుంది. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు కలపాలి.  ఆ నీటితో స్నానం చేస్తే శరీరం, మనసు తేలికపడతాయి. జీవితంలో నెగెటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. ఉప్పు నీటి స్నానం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్నో లాభాలు
Image Credit : Asianet News

ఎన్నో లాభాలు

ఉప్పుకు నెగెటివ్ ఎనర్జీని తొలగించే శక్తి సహజంగానే ఉంటుంది. ఉప్పును నీటిలో కలిపి స్నానం చేస్తే, శరీరం, మనసు తేలికపడతాయి. ఉప్పు నీటి స్నానం మన చుట్టూ ఉన్న చెడు శక్తిని చాలా వరకు తగ్గిస్తుంది. ఇది మన జీవితంలో  పాజిటివిటీని పెంచుతుంది. మీకు నెగెటివ్‌ ఆలోచనలు ఎక్కువ అవుతున్నప్పుడు ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిది.

34
ఒత్తిడి తగ్గుతుంది
Image Credit : stockPhoto

ఒత్తిడి తగ్గుతుంది

మీకు విచారంగా లేదా భయంగా అనిపించినప్పుడు బకెట్ నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే మంచిది. వాస్తు శాస్త్ర నిబంధనల ప్రకారం ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.  పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. పనుల్లో ఆటంకాలు కూడ చాలా వరకు తగ్గుతాయి. కొన్నిసార్లు చాలా కష్టపడి పనిచేసినా ఫలితం సరిగా ఉండదు. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల జీవితంలోని నెగెటివ్ విషయాలను తగ్గిస్తుంది. పనులు మళ్లీ సాఫీగా సాగుతాయి. 

44
మనసు ప్రశాంతంగా ఉంటుంది
Image Credit : Getty

మనసు ప్రశాంతంగా ఉంటుంది

బకెట్ నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా మారుతుంది. మీరు చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం తగ్గుతుంది కాబట్టి ఇతరులతో మీ సంబంధాలు బలపడతాయి. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా మీరు తాజాగా, శక్తివంతంగా ఉంటారు.  అయితే, రోజూ ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిది కాదు. వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Palmistry: మీ అరచేతిలో ఈ గుర్తులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved