MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా బెల్లాన్ని తినాలని ఎందుకు చెప్తారో తెలుసా?

భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా బెల్లాన్ని తినాలని ఎందుకు చెప్తారో తెలుసా?

ఇప్పుడైతే ఈ అలవాటు లేదు కానీ.. ఒకప్పుడు మాత్రం భోజనం చేసిన తర్వాత బెల్లాన్ని తప్పకుండా తినేవాళ్లు.  ఇప్పటికి కూడా మన పెద్దలు ఈ అలవాటు  మంచిదని చెప్తుంటారు. ఎందుకంటే దీనివల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 28 2022, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అన్నం తిన్న తర్వాత బెల్లం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిజానికి చక్కెర కంటే బెల్లమే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ అన్నం తిన్న తర్వాత బెల్లం తినడం వల్ల  శరీరంలో ఇనుము లోపం పోతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది కూడా. 
 

27

భోజనం తర్వాతే బెల్లాన్ని ఎందుకు తినాలి?

నిజానికి బెల్లాన్ని ఎప్పుడైనా తినొచ్చు. కానీ భోజనం చేసిన తర్వాత  తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. దీనివల్ల తిన్న ఆహారం చాలా సులువుగా జీర్ణం అవుతుంది. బెల్లంలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్ గా బెల్లం తినేవారికి పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. పిల్లలు, వృద్ధులు బెల్లాన్ని ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  
 

37
<p>jaggery</p>

<p>jaggery</p>

జీర్ణక్రియకు సహాయపడుతుంది 

రెగ్యులర్ గా ఆహారం తిన్న తర్వాత బెల్లాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. కడుపులో గ్యాస్, అజీర్ణ సమస్యలను రాకుండా చేస్తుంది. బెల్లంలో ఉండే పోషకాలు ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. భోజనం చేసిన వెంటనే ఇతర స్వీట్లను తినే బదులుగా బెల్లాన్ని తినడం అలవాటు చేసుకోండి. 
 

47
<p>jaggery</p>

<p>jaggery</p>

ఎముకలను బలపరుస్తుంది

రెగ్యులర్ గా బెల్లం తినడం వల్ల మీ శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. దీంతో మీ ఎముకలు బలంగా తయారవుతాయి. పిల్లలకు బెల్లం తినిపించడం వల్ల వారి ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎదుగుదల కూడా బాగుంటుంది. క్రమం తప్పకుండా భోజనం చేసిన తర్వాత బెల్లాన్ని తింటే కండరాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

57

ఎర్ర రక్తకణాలు సంఖ్యను పెంచుతుంది

బెల్లంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల  శరీరంలో రక్తం తక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంగటే ఇది ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. హిమోగ్లోబిన్ పెరగాలంటే ఇతర ఆహారాలతో పాటుగా బెల్లాన్ని కూడా తినాలి. బెల్లం తినడం వల్ల మీ శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. 
 

67

వెయిట్ లాస్

భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో పొటాషియం కూడా ఉంటుంది. ఈ పోషకం జీవక్రియను పెంచుతుంది. బెల్లం తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఎలాంటి ఆహారాలను తినాలనిపించదు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. చక్కెర, ఇతర స్వీటెనర్ల కంటే బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది.
 

77

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బెల్లంలో జింక్ తో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ప్రతిరోజూ బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీంతో ఎన్నో రోగాల ప్రమాదం తప్పుతుంది. బెల్లం మీ శరీరంలో వేడిని  కాపాడుతుంది. అలాగే జలుబు చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Goa Trip: గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? త‌క్కువ ఖ‌ర్చుతో ఇలా ప్లాన్ చేసుకోండి
Recommended image2
Baby Gold Earrings: చిన్నారుల కోసం క్యూట్ గోల్డ్ టాప్స్.. చూడండి
Recommended image3
Hair Dye: జుట్టుకు రంగేస్తుంటే.. ముఖానికి అంటుకుందా? ఆ మరక వదిలించే బెస్ట్ చిట్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved