anxiety: ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే..
anxiety: కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. దీనికి కారణం మారుతున్న మన జీవన విధానమే. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అవేంటంటే..

anxiety: మారుతున్న జీవన విధానం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఈ కారణంగానే చాలా మంది చిన్న చిన్న విషయాలకు కూడా ఊరుకూరికే టెన్షన్ పడిపోతూ ఉంటారు. వీటితో పాటుగా కొన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఒత్తిడిని ప్రేరేపిస్తాయి.
ఈ ఒత్తిడి పెంచడంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా లభించే ఫుడ్, జంక్ ఫుడ్, ఉప్పుు మోతాదుకు మించి ఉండే ఆహార పదార్థాలు ముందుంటాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల ఒత్తిడిని ఈజీగా జయించొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డార్క్ చాక్లెట్: అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా డార్క్ చాక్లెట్లను తినడమంటే మహా ఇష్టం. ఈ చాక్లెట్ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయన్న సంగతి మనకు తెలిసిందే. మీకు తెలుసా.. ఈ డార్క్ చాక్లెట్ ఒత్తిడిని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి Blood circulation మెరుగ్గా జరిగేలా చేస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడిని దూరం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు ఒక డార్క్ చాక్లెట్ ముక్కను తిన్నా.. మీ మూడ్ ఆటోమెటిక్ గా చేంజ్ అవుతుంది.
డ్రై ఫ్రూట్స్: డ్రూ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మెగ్నీషియం తో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి పోషకవిలువలు మెండుగా ఉండే బ్రెజిలియన్ నట్స్, వాల్ నట్స్, బాదం వంటి వాటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీ మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. అంతేకాదు వీటిని తింటే ఆందోళన, ఒత్తిడి కూడా మటుమాయం అవుతాయి.
సాల్మాన్ చేపలు: మెరుగైనా ఆరోగ్యాన్ని అందించడంలో చేపలు ముందుంటాయి. ఎందుకంటే వీటిలో పోషకవిలువలు అధిక మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా సాల్మాన్ చేపలతో మన ఒత్తిడి దూరం అవుతుంది. ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. వీటి వల్ల మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే కదా ఇతరదేశస్తులు ఈ చేపలను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
పెరుగు: పెరుగులో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఒత్తిడి క్షణాల్లో దూరం అవుతుంది. కాబట్టి ఒత్తిడిగా ఫీలైనప్పుడు దాని నుంచి బయటపడటానికి పెరుగును తినడం అలవాటు చేసుకోండి.
చమోమిలే టీ: కొన్నిరకాల ఫ్లవర్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో శంఖాకార పువ్వులో ఎన్నో ఔషద గుణాలు దాగుంటాయిని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో చామంతి పువ్వు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటితో టీ చేసుకుని తాగితే శరీరంలో మంట పుట్టే అవకాశమే ఉండదు. అంతేకాదు ఈ టీ ఒత్తిడిని కూడా క్షణాల్లో దూరం చేస్తుంది. అలాగే Blood flow స్థిరంగా ఉంచేలా చేస్తుంది.