MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • అంజీర ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీళ్లు మాత్రం తినకూడదు..

అంజీర ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీళ్లు మాత్రం తినకూడదు..

అంజీర లేదా అత్తి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగని వీటిని అతిగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య  సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 07 2022, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే రోజూ గుప్పెడు గింజలను తినాలని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు చెబుతుంటారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయినప్పటికీ వీటిని మోతాదుకు మించి అస్సలు తినకూడదు. ఇలాంటి పండ్లలో  డ్రై అంజీర పండ్లు కూడా ఉన్నాయి. ఈ పండ్లు ఎన్నో రోజులు నిల్వ ఉంటాయి. అయితే ఈ పండ్లను మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

కాల్షియం లోపం

అత్తి పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అతిగా అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే కాల్షియం లోపిస్తుంది. ఎందుకంటే ఈ పండులో ఆక్సలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో కాల్షియాన్ని గ్రహిస్తుంది. దీంతో మన శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీంతో శరీరం, ఎముకలు బలహీనపడతాయి. 

36

టేస్టీగా ఉంటాయని అంజీర పండ్లను ఎక్కువగా తింటుంటారు చాలా మంది. కానీ ఇది కడుపును దెబ్బతీస్తుంది. అంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అపానవాయువు (పిత్తులు) వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని మోతాదులోనే తినాలి. అత్తి పండ్లను తిన్న తర్వాత ఒక గ్లాస్ నీటిని ఖచ్చితంగా తాగండి. 

46

మూత్రాశయ, మూత్రపిండాల వ్యాధులున్న వారు అంజీర పండ్లను ఎక్కువగా తినకూడదు. మోతాదులోనే తినాలి. ఎందుకంటే దీనిలో ఉండే ఆక్సలేట్ ఈ అవయవాలను దెబ్బతీస్తుంది. అలాగే తెల్ల రక్తకణాలు ఏర్పడే ప్లీహాన్ని కూడా తొలగిస్తుంది. 
 

56

రక్తస్రావ సమస్య

అంజీర పండ్లకు వేడి చేసే గుణముంటుంది. అందుకే వీటిని వేసవిలో ఎక్కువగా తినకూడదు. లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే వీటిని శీతాకాలంలో కూడా వీటిని మోతాదులోనే తినాలి. లేదంటే రక్తస్రావ సమస్య వస్తుంది. 

66

అత్తిపండ్లను మోతాదుకు మించి తింటే పేగులు, కాలెయం దెబ్బతింటాయి. వీటిని ఎక్కువగా తింటే కాలెయ సమస్యలు వస్తాయి. అలాగే పేగు సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ పండు విత్తనాలు అంత సులువుగా అరగవు. దీంతో అజీర్థి సమస్యలు వస్తాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Budget Travel : కేవలం వేల రూపాయల ట్రిప్.. కోటీశ్వరుల్లా లగ్జరీస్ ఎంజాయ్ చేసే దేశమేదో తెలుసా?
Recommended image2
Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?
Recommended image3
Set Dosa: హోటల్ స్టైల్ స్పాంజిలాంటి సెట్ దోశ ఎలా చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved