MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health care tips: డయాబెటీస్ పేషెంట్లు ఈ కూరగాయలను అసలే తినకూడదు..

Health care tips: డయాబెటీస్ పేషెంట్లు ఈ కూరగాయలను అసలే తినకూడదు..

Health care tips: మధుమేహులు ఏవి పడితే అవి తినడానికి లేదు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే ప్రమాదముంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 06 2022, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మాంసాహారాల కంటే కూరగాయలే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎన్నో రకాల విటమిన్లు, ముఖ్యమైన ఖనిజాలుంటాయి. ఇవి ఎన్నో రకాల రోగాలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. కానీ మధుమేహులకు మాత్రం కొన్ని రకాల కూరగాయలు ఎంతమాత్రం మంచివి కావు. వీటిని తింటే వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాదు.. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి. ఇంతకు డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బంగాళాదుంప (potato)

బంగాళా దుంపలు మధుమేహుల ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఎందుకంటే వీటిలో పిండిపదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయన్న మాట. ముఖ్యంగా బంగాళా దుంపల్లో గ్లైసెమిక్  ఇండెక్స్ సూచిక ఎక్కువగా ఉంటుంది. కాల్చిన పొటాటోలో దాదాపుగా  111 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే.. ఉడికించిన దానిలో అయితే 82 ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 

37

మొక్కజొన్న (corn)

మొక్కజొన్న ఆరోగ్యానికి మేలు చేసేదే అయినా.. డయాబెటీస్ పేషెంట్లు మాత్రం మొక్కజొన్నను అసలే తినకూడదు. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 52 ఉంటుంది. అంతేకాదు దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ దీన్ని పైబర్ ఫుడ్ గా పరిగణించరు. ఒకవేళ తినాలనుకుంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో కలిపి తినండి. దీన్ని ఒక్కదాన్నే తింటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. 

47
green peas

green peas

బఠాణీలు (peas)

బఠాణీల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. పిండి పదార్థాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటివల్ల మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.  ఇంతేకాదు వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 గా ఉంటుంది. అందుకే డయాబెటీస్ రోగులు బఠాణీలను తినకూడదు. 
 

57

వెజిటేబుల్ జ్యూస్ (Vegetable juice)
 
గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. కానీ వీటిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిను కంట్రోల్ లో ఉంచుతుంది. అందుకే గ్రీన్ వెజిటేబుల్స్ ను సలాడ్ లా కాకుండా.. మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. 
 

67

టమాటా (Tomato)

టామాలు ఆరోగ్యానికి మంచి చేసేవే అయినా వీటిలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటమే కాదు.. తీపి కూడా ఉంటుంది. అందుకే మధుమేహులు పచ్చి టమాటాలను మొత్తానికే తినకూడదు. వంటల్లో కూడా తక్కువగానే వేయాలి. 
 

77

అరటికాయ (banana)

అరటికాయను కూడా వివిధ రకాల కూరలు చేయడానికి ఉపయోగిస్తుంటారు. అందుకే కొంతమంది దీన్ని కూరగాయగా పరిగణిస్తారు. అయితే అరటిలో ఎక్కువ మొత్తంలో తీపి, పిండిపదార్థాలు ఉంటాయి. ఇవి మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు వీటిని కూడా తినకూడదు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Earrings: ఈ క్యూట్ సిల్వర్ ఇయర్ రింగ్స్ డైలీ వేర్ కి బాగుంటాయి
Recommended image2
Neem Leaves: ఈ చిన్ని ఆకులు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుతుంది
Recommended image3
Hair Care Tips: తలస్నానం చేసేటప్పుడు ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే.. జుట్టు రాలమన్నా రాలదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved