బియ్యం నీటిలో స్టార్చ్, ఫాస్పరస్, పొటాషియంతో పాటు.. చాలా పోషకాలు ఉంటాయి. ఇవి మట్టికీ, మొక్కల వేర్లకు ఎంతో మేలు చేస్తాయి.
ఆకుకూరలకు బియ్యం కడిగిన నీళ్లు పోస్తే అవి చాలా వేగంగా, గుబురుగా పెరుగుతాయి.
టమాటా మొక్కలకు ఈ నీళ్లు పోయడం వల్ల పూత, కాయల ఎదుగుదల అద్భుతంగా పెరుగుతుంది.
పచ్చిమిర్చి మొక్క బలంగా మారడానికి, మంచి దిగుబడి ఇవ్వడానికి బియ్యం నీళ్లు బాగా సహాయపడతాయి.
వంకాయ మొక్కలకు బియ్యం కడిగిన నీళ్లు పోస్తే కాయల దిగుబడి అమాంతం పెరుగుతుంది.
పాలకూర మొక్కలకు ఈ నీళ్లు పోయడం వల్ల ఆకులు పచ్చగా, ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి.
కొత్తిమీర మొక్క బలంగా పెరగడమే కాకుండా, ఆకులు ఎంతో తాజాగా ఉంటాయి.
నిమ్మ, నారింజ లాంటి మొక్కలకు బియ్యం నీళ్లు పోస్తే కాయలు లేదా పండ్ల సైజు బాగా పెరుగుతుంది.
వంట చేసే ముందు బియ్యం కడిగిన నీళ్లను పారబోయకుండా మట్టిలో పోయండి. ఇది మొక్కలకు చీడపీడలు, ఫంగస్ రాకుండా అడ్డుకుంటుంది.
Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!