తెలుపు, ఎరుపు ఉల్లిపాయల్లో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తుంది..?
మార్కెట్ లో రెండు రకాల ఉల్లిపాయలు లభిస్తాయి. ఒకటి తెల్లరంగు, రెండోది ఎరుపు రంగు. అయితే వీటిలో ఒకటి మాత్రం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులోనూ ఉల్లిపాయలు కూరలకు మంచి రుచిని తీసుకొస్తాయి. అందుకే ఉల్లిని ప్రతి ఒక్క కూరలోనూ ఉపయోగిస్తుంటారు. ఉల్లిపాయలను కూరల్లోనే కాకుండా పచ్చిగా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
వేసవిలో పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అయితే ఎర్ర ఉల్లిపాయలపై ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఎర్ర ఉల్లిపాయలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడానికి సహాయపడతాయని పరిశోధనలు వెల్లడించాయి. అయితే ఎర్ర ఉల్లి కంటే తెల్ల ఉల్లి ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్ల ఉల్లి ప్రయోజనాలు
తెల్ల ఉల్లిపాయలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బయోటిక్ గుణాలుంటాయి.అంతేకాదు దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి.
తెల్ల ఉల్లిగడ్డ శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. శ్వాసలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. అంతేకాదు చెవి, ముక్కు, కన్ను కు సంబంధించిన ఇన్ఫెక్షన్ల లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఉల్లిపాయలో ఆల్కలీన్ స్వభావం ఉంటుంది. ఇది ఎసిడిటీ సమస్య నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ప్రాసెస్ చేసిన కార్భోహైడ్రేట్ల ఆమ్ల లక్షణాలను సమతుల్యం చేస్తుంది.
జుట్టు రాలడం, సన్నబడటం వంటి సమస్యలను పోగొట్టి జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం ఉల్లి రసాన్నా నెత్తికి అప్లై చేసుకోవాలి.
ఎరుపు ఉల్లిపాయ ప్రయోజనాలు
ఎర్ర ఉల్లిగడ్డలో విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, చక్కెర, కార్భోహైడ్రేట్లు, ఇతర ముఖ్యమైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఉల్లిపాయలో తెల్ల ఉల్లియాలో కంటే తక్కవ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. తెలుపు, ఎరుపు ఉల్లిపాయల్లో.. తెలుపు ఉల్లిపాయలనే ముందు ఎంచుకోండి. ఇది ఆరోగ్యాన్ని ఎంతో రక్షిస్తుంది.