డిసెంబర్లో ఈ లోయ చాలా చల్లగా, మంచుతో కప్పి ఉంటుంది. స్నో-పాయింట్, జీరో పాయింట్‌లలో హిమపాతం కురుస్తూనే ఉంటుంది.
స్పితి వ్యాలీ చుట్టుపక్కల గ్రామాలు డిసెంబర్‌లో మంచుతో కప్పి ఉంటాయి. ఇక్కడ విపరీతమైన చలి వేస్తుంది. మంచును ఇష్టపడేవారికి ఇది సరైన ప్రాంతం.
డిసెంబర్లో కాశ్మీర్‌లో వెళ్లారంటే కచ్చితంగా ఈ ప్రాంతాన్ని చూడండి. మొదటి భారీ హిమపాతం గుల్మార్గ్‌లో మొదలవుతుంది. ఆసియాలోనే ఎత్తైన గొండోలా రైడ్, స్కీయింగ్‌కు ఇది హాట్‌స్పాట్.
ఉత్తరాఖండ్ లోని టాప్ స్కీయింగ్ స్పాట్ ఇది. డిసెంబర్‌లో ఇక్కడి పర్వతాలు పూర్తిగా తెల్లటి మంచుతో కప్పి ఉంటాయి.
కుఫ్రీలో డిసెంబర్ మధ్య మంచు బాగా కురుస్తుంది. గుర్రపు స్వారీ, టాయ్ ట్రైన్, మంచుతో కప్పిన ప్రాంతాలు పర్యాటకులకు బాగా నచ్చుతుంది.
ఈ నెలలో రోహ్‌తాంగ్ పాస్, సోలాంగ్ వ్యాలీలో భారీ హిమపాతం పడుతుంది. స్కీయింగ్, స్నో బైక్, మంచును ఆస్వాదించాలంటే ఈ ప్రాంతానికి వెళ్లండి.
మనదేశంలో చాలా తక్కువ ప్రాంతంలోనే మంచు పడుతుంది. కాబట్టి అందరూ ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.
అన్నింటి కన్నా కాశ్మీర్ లో జనావాసాలపై తీవ్రంగా డిసెంబర్లో మంచు పడుతుంది.