పచ్చి బొప్పాయి మన పాణానికి ఇంత మంచి చేస్తదా..?
బొప్పాయి పండే కాదు.. కాయ కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తది. దీన్ని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఇట్టే దూరమవుతాయి.
raw papaya
ముడి లేదా.. పండని బొప్పాయిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. కాయే కదా అని తినకుండా ఉంటే.. మనం ఎన్నో ప్రయోజనాలను మిస్ అయినట్టే మరి. ఎందుకంటే ఈ పచ్చి బొప్పాయి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్లు, కైమోపైన్, పపైన్ వంటి ఎంజైమ్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గాయాలను త్వరగా మానడానికి సహాయపడతాయి. అలాగే మలబద్దకం సమస్య నుంచి బయటపడేస్తాయి. ఇది జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అసలు ముడి బొప్పాయి మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం పదండి..
papaya
జీర్ణక్రియకు సహాయపడుతుంది
పచ్చి బొప్పాయిలో డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పులియబెట్టిన స్టార్చ్ ను ఉత్పత్తిని చేయడానికి సహాయపడుతుంది. ఇది చివరికి జీర్ణాశయంలోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు ఆహరం (ప్రీబయోటిక్) గా మారుతుంది. ఇది గట్ ను మరింత ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
డెంగ్యూను తగ్గించడానికి సహాయపడుతుంది
డెంగ్యూ జ్వరం అంత తొందరగా విడవదు. అయితే బొప్పాయి ఆకులు డెంగ్యూ జ్వరం త్వరగా తగ్గేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం బొప్పాయి ఆకుల నుంచి రసాన్ని తీసి తాగాలి. ఇది తెల్ల రక్తకణాల ప్లేట్లెట్ల సంఖ్యను పెంచేందుకు సహాయపడుతుంది. అయితే డెంగ్యూ జ్వరం వస్తే ఈ ప్లేట్లెట్ల సంఖ్య దారుణంగా పడిపోతుంది. అయితే ఈ బొప్పాయి రసం ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుంది అనడానికి ఎలాంటి నిర్ధిష్ట పరిశోధనలు జరగలేదు.
మలబద్దకాన్ని నివారిస్తుంది
పచ్చి బొప్పాయిలో ఎన్నో ఆరోగ్యకరమైన ఎంజైమ్లు ఉంటాయి. ఇవి మీ కడుపును బాగా శుభ్రపరుస్తాయి. అలాగే జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సహాయపడతాయి. అలాగే పచ్చి బొప్పాయి పేగు కదలికలను నియంత్రిస్తుంది. ఎందుకంటే వీటిలో యాంటీ పరాన్నజీవి, యాంటీ అమీబిక్ స్వభావం ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా చేస్తాయి. అలాగే మలబద్దకం సమస్య ఏర్పడకుండా చూస్తాయి.
మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది
ఆకుపచ్చని బొప్పాయిలో ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. ఈ ఖనిజాలు ఇన్సులిన్ విడుదలను పెంచడానికి కూడా సహాయపడతాయి. టైప్ 2 డయాబెటీస్ కు కారణమయ్యే ముఖ్యమైన ఎంజైమ్ లకు ఇవి వ్యతిరేకంగా పనిచేస్తాయి.