ఈ సమస్యలున్న వారు ఆరెంజ్ జ్యూస్ ను తప్పకుండా తాగాలి.. ఎందుకంటే..
తీయ తీయగా.. పుల్ల పుల్లగా ఉండే నారింజ పండ్లలో ఉండే ఎన్నో ఔషదగుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

నారింజ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ సీజన్ లో నారింజలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లను రోజూ తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా.. ఎన్నో ప్రయోజనాలను పొందుతాయి. నారింజ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఆరెంజ్ పండ్లను తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి..
orange juice
విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
సిట్రస్ ఫ్రూట్ అయిన నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంటే ఈ పండులో 70 శాతం ఉంటుంది. అంటే ఇది ఒక రోజు మన శరీరానికి సరిపోతుందన్న మాట. ఈ విటమిన్ సి తోనే మన రోగనిరోధక శక్తి బలపడుతుంది.
పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది
ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం సమస్యను పోగొట్టడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ ఫైబర్ కంటెంట్ పేగులను క్లీన్ గా ఉంచుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. నారింజ పండును తినడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి.
గర్భిణీ స్త్రీలకు మంచిది
గర్భిణీల ఆరోగ్యానికి నారింజ పండ్లు చాలా మంచివి. దీనిలో ఉండే విటమిన్ బి , ఫోలేట్ లు డీఎన్ఏ ను తయారుచేయడానికి ఉపయోగపడతాయి. ఈ నారింజ పండ్లు బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడుతుంది. బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది.
నారింజ పండ్లు మెడిసిన్స్ కంటే తక్కువేం కాదు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఒక పండులో ఫైటోకెమికల్స్ 170 ఉంటే.. ఫ్లేవనాయిడ్లు 60 ఉంటాయి. ఈ పండును తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.