MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మునగాకుతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్ని సమస్యలు తగ్గిపోతాయో తెలుసా?

మునగాకుతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్ని సమస్యలు తగ్గిపోతాయో తెలుసా?

మునగాకులు యాంటీ ఆక్సిడెంట్ల భాండాగారం. మునగాకుల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, ఐరన్, కాల్షియం, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఎన్నో వ్యాధులను దూరం చేసే దివ్య ఔషదగుణాలుంటాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 29 2022, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చాలా మంది మునగ ఆకులను తినడానికి వెనకాడుతుంటారు. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి మునగాకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులు పోషకాల భాండాగారం. మునగాకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లు, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, అమైనో ఆమ్లాలు వంటి ముఖ్యమైన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మునగాకులకు ఎన్నో వ్యాధులను తగ్గించే సామర్థ్యం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మలేరియా, జ్వరం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనేక వ్యాధుల తీవ్రతను తగ్గించడానికి కూడా ఈ ఆకులు సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకులను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

గుండెకు మంచిది

మునగ ఆకుల్లో రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మునగ ఆకుల్లో జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడానికి లేదా నివారించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

36

యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్

మునగాకుల్లో ఒలిఫెరాలో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మునగాకుల పొడిని తీసుకుంటే రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిలు పెరుగుతాయి. 
 

46

ఆరోగ్యకరమైన చర్మం

చలికాలంలో చర్మానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా చర్మం పొడిబారడం, దురద, నల్లని మచ్చలు వంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటినీ పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా, అందంగా చేయడానికి మునగాకులు ఎంతో  సహాయపడతాయి. మునగాకుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణగా పనిచేసి చర్మాన్ని రక్షిస్తాయి.

56
Moringa Leaves

Moringa Leaves

నిద్రను మెరుగుపరుస్తుంది

మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేట్టు చూడాలి. ఎందుకుంటే పోషకాలు మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు.. రాత్రిళ్లు హాయిగా నిద్రపోవడానికి కూడా సహాయపడతాయి. మునగ ఆకులు శక్తివంతమైన ఆహారాల్లో ఒకటి. ఎందుకంటే ఇవి మీ శక్తిని పెంచుతాయి. శరీరంలో విటమిన్ల లోపం లేకుండా చూస్తాయి. మంటను తగ్గిస్తాయి. 
 

66

జీర్ణక్రియకు మంచిది

మునగ ఆకులు కూడా జీర్ణ వ్యవస్థకు సహాయపడుతాయి. ముఖ్యంగా  ఈ ఆకులు జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. గ్యాస్ట్రైటిస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడేవారు మునగాకులను తింటే మంచిది. ఈ ఆకులు ఈ సమస్యలను తగ్గిస్తాయి. మునగ ఆకుల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Semiya Upma: సేమియా ఉప్మా పొడిపొడిగా రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి
Recommended image2
Trendy Earrings: గుండ్రటి ముఖానికి సూపర్‍గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్
Recommended image3
Kitchen Hack: స్టీల్ గిన్నెలపై మొండి మరకలా? ఈ ఒక్కటి చాలు మెరిసిపోతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved