- Home
- Life
- రోజుకు రెండు జామకాయలు తింటే బరువు తగ్గడం నుంచి.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ తో పాటు ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా
రోజుకు రెండు జామకాయలు తింటే బరువు తగ్గడం నుంచి.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ తో పాటు ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా
Health Tips: రోజుకు రెండు జామకాయలు తింటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటంతో పాటుగా అధిక బరువు తగ్గి, నిరోనిరోధక శక్తి పెరుగుతుంది. కాలెయ పనితీరు మెరుగుపడటంతో పాటుగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.

guava
జామ కాయలు (Guava)మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అందుకే సీజన్లతో సంబంధం లేకుండా కనీసం రోజుకు ఒకటైనా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. అయినా ఈ జామకాయలు సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండవు. సో వీటిని తరచుగా తినాలని చెబుతున్నారు.
guava
జామకాయల్లో పోషకాలు (Nutrients) పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలో విటమిన్ సి (Vitamin C), పీచు పదార్థం (fiber)ఎక్కువ మొత్తంలో ఉంటుంది. జామకాయలే కాదు.. జామ ఆకులు (Guava leaves) కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
జామకాయలను తినడం వల్ల అధిక బరువు (overweight)తగ్గుతుంది. కాలెయ (liver) పనితీరు మెరుగ్గా ఉంటుంది. దీన్ని బాగా నిమలడం వల్ల పళ్లు ( teeth) బలంగా తయారవుతాయి. జామ ఆకుల రసం చిగుళ్లు, దంత సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు గొంతు నొప్పి (sore throat) కూడా తగ్గుతుంది.
ఆకలి పెరిగేందుకు, జీర్ణక్రియ (digestion)ఆరోగ్యంగా ఉండేందుకు జామ ఆకుల టీ (Guava leaves tea)ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు ఈ టీ తో వాంతులు (vomiting), వికారం (nausea)వంటి సమస్యలను కూడా తగ్గిపోతాయి.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు రోజుకు రెండు జామకాయలను తింటే చాలా ఫాస్ట్ గా బరువు తగ్గిపోతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దీనిలో ఉండే విటమిన్ సి (Vitamin C) రోగనిరోధక శక్తి (Immunity)ని కూడా పెంచుతుంది.
ముఖ్యంగా ఎన్నో రకాల క్యాన్సర్లు సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. జామకాయలను తినడం వల్ల గుండె (heart) బలంగా, ఫిట్ గా ఉంటుంది. చర్మం సంబంధ సమస్యలు తొలగిపోయి.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. జామలో ఉండే ఔషదగుణాలు శరీర నొప్పులను తగ్గిస్తాయి. గాయాలు కూడా తొందరగా మానిపోతాయి.
పురుషులు జామ కాయలను తరచుగా తినడం వల్ల సంతానలేమి సమస్యలు (Infertility problems)తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వచ్చే స్త్రీలు జామకాయలు తింటే మంచిది. ఇవి నెలసరి నొప్పులను, ఇతర సమస్యలను ఈ కాయలు తగ్గిస్తాయి.
జామకాయల్లో విటమిన్ ఎ (Vitamin A) కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. తరచుగా వీటిని తింటే కంటి చూపు మెరుగుపడుతుంది.
చాలా మంది వర్షాకాలంలో జామకాయను తినరు. తింటే జలుబు (cold)చేస్తుందని భావిస్తారు. కానీ వర్షాకాలంలో కూడా జామకాయలను కూడా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్ లో వైరల్ ఫీవర్, బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యల బారిన పడకూడదంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. అప్పుడే విరేచనాలు, వాంతులు, జ్వరం, జలుబు రావు. అలాగే గొంతునొప్పి, దగ్గు, డయేరియా వంటి సీజనల్ సమస్యల బెడద కూడా తప్పుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.