చలికాలంలో రోజూ ఒక నారింజ పండును తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
చలికాలంలో ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో రోజూ ఒక నారింజ పండును తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నారింజ: నారింజ (Orange) జ్యూస్ తీసుకుంటే చర్మం ముడుతలు పడకుండా టైట్ గా ఉంచే కొలాజిన్ (Collagen) ను ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ముఖంపై ఏర్పడే వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గించి చర్మ నిగారింపు పెంచుతుంది.
శీతాకాలంలో దగ్గు, జ్వరం, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం సర్వ సాధారణం. ముఖ్యంగా ఈ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి తగ్గితే ఎన్నో రోగాలు, ఇతర అంటువ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తింటూ ఉండాలి. ఈ సీజన్ లో రోజూ ఒక నారింజ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే..
నారింజ పండు మన జీర్ణవ్యవస్థకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నారింజలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడేవారికి నారింజ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇది కడుపులో కొవ్వును వేగంగా కరిగిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫ్రూట్. దీనిలో ఉండే ఫైబర్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల మీరు అతిగా తినలేరు. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
ఆరెంజ్ గుండె సంబంధిత అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే ఫ్లెవనాయిడ్లు గుండె జబ్బులకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. నారింజలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఇది లోపిస్తే.. ఎముకలు, దంతాలు బలహీనంగా మారతాయి. వెంట్రుకలు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది.
నారింజ పండ్లను తినడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. నిజానికి చర్మానికి నారింజ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నారింజపండ్లను తినడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. మచ్చలు మటుమాయం అవుతాయి. ముఖం అందంగా మెరిసిపోతుంది. గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. నారింజ తొక్కను ఉపయోగించి ముఖాన్ని అందంగా.. మృదువుగా చేయొచ్చు. ఈ పండు మూత్రపిండాల్లో రాళ్లను కూడా కరిగిస్తుంది. ఈ పండు మూత్రంలో సిట్రేట్ స్థాయిని పెంచుతుంది. దీనివల్ల కిడ్నీల్లో రాళ్లు తగ్గిపోతాయి.