MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చలికాలంలో టమాటా సూప్ తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!

చలికాలంలో టమాటా సూప్ తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!

సీజన్ ను బట్టి ఆహారాల్ని తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో కొన్ని ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. అందులో టమాటా సూప్ ఒకటి. టమాటా సూప్ ఈ చలికాలంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 28 2022, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


శీతాకాలంలో వెచ్చని ఆహారాల్నే తినాలనిపిస్తుంది. అందుకే చాలా మంది వేడి వేడి టీ, కాఫీ, సమోసా, బోండాలను తీసుకుంటుంటారు. కానీ  ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. కానీ ఈ సీజన్ లో కొన్ని సూప్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సూప్ లు శరీరానికి వేడి అనుభూతిని ఇవ్వడమే కాదు.. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. చలికాలంలో వివిధ కూరగాయల సూప్ ను తయారు చేయవచ్చు. అన్నింట్లో టమాటా సూప్  ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తాగొచ్చు. 

నిజానికి టొమాటో సూప్ రుచి అద్భుతంగా ఉంటుంది. శీతాకాలంలో టమోటా సూప్ తాగితే.. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు టమాటా సూప్ ను ఈ సీజన్ లో తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25


అనారోగ్యం నుంచి రక్షణ

చలికాలంలో తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. చాలా మంది ఈ సీజన్ లో జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుంటారు. దీనివల్ల తరచుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. చలికాలంలో మీరు తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటే.. మీ ఆహారంలో టొమాటో సూప్ ను చేర్చండి. ఇది మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. టమాటాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడటానికి మీకు బలాన్ని ఇస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 

35

శరీర ఉష్ణోగ్రత

శీతాకాలంలో చలి కారణంగా మన శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉంటుంది. శీతలీకరణతో బాధపడేవారు తమ శరీరాన్ని వేడి చేయడానికి టీ, కాఫీ లను తాగుతారు. కానీ ఇవి మన శరీరాల్ని కొద్దిసేపు మాత్రమే వెచ్చగా ఉంచుతాయి. అంతేకాదు ఇవి డీహైడ్రేషన్ సమస్యను పెంచుతాయి. అయితే టొమాటో సూప్ అలా కాదు. ఇది మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అలాగే డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 

45

బరువు నియంత్రణ

చలికాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దీనివల్లే చాలా మంది మోతాదుకు మించి తినేస్తుంటారు. చలికారణంగా వ్యాయామం చేయనివారున్నారు. కానీ దీనివల్ల బరువు పెరుగుతుంది. చలికాలంలో  మీ బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే టమాటా సూప్ ను తాగండి. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఇది మీ బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. టమాటా సూప్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల మీరు అతిగా తినలేరు. 
 

55

చలికాలంలో టమోటా సూప్ తీసుకోవడం వల్ల శరీరానికి హాని చేసే టాక్సిన్స్ బయటకు పోతాయి. చలికాలంలో ఫుడ్ ను అతిగా తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇక హాట్ ఫాస్ట్ ఫుడ్ ను తినడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల  జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. ఈ సమస్యలను టమాటా సూప్ తగ్గిస్తుంది. టొమాటో సూప్ లోని నీటి శాతం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. టమోటాలలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను పనితీరును మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం సులవుగా జీర్ణమవుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sleep Tips : రాత్రిళ్లు నిద్రలేక ఇబ్బంది పడుతున్నారా? చిటికెలో గాఢనిద్రలోకి జారుకునే సింపుల్ టిప్స్
Recommended image2
BlackBeads: మెడ నిండుగా కనిపించే పంజాబీ మంగళసూత్రాలు.. ఓ లుక్కేయండి
Recommended image3
Fashion Tips: లైట్ వెయిట్ శారీస్.. వేసవిలో స్టైల్‌తో పాటు కూల్ లుక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved