MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • శంఖం ఊదడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?

శంఖం ఊదడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?

ప్రతి ఇంట్లో దేవుడి మందిరంలో శంఖం తప్పకుండా ఉంటుంది. శంఖం వల్ల ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి..సంతోషం వెల్లివిరుస్తుందని నమ్ముతారు. అయితే ఈ శంఖం ఉండటం వల్ల ఇంట్లో శుభం జరగడమే కాదు.. దీన్ని ఊదడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనానలు కూడా కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 30 2022, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేవుడి మందిరంలో శంఖం ఉండటం శుభం.  దీనివల్ల ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవని నమ్ముతారు. అందుకే పూజా సమయంలో, శుభకార్యాలు, పండుగలకు దేవలయాల్లో శంఖాన్ని ఖచ్చితంగా ఊదుతారు. జ్యోతిష్యం ప్రకారం.. శంఖం పవిత్రమైంది. ఇంట్లో శంఖం ఉండటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే దేవుళ్లతో పాటుగా శంఖానికి కూడా  పూజ చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం... శంఖాన్ని కీర్తి, సంవృద్ధి, దీర్ఘాయుష్షు కోసం పూజిస్తారు. శంఖం ఊదటం వల్ల ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు వదిలిపోతాయని నమ్ముతారు. శంఖంలోని ప్రతి భాగం దేవతల నివాసంగా చెప్తారు. 

నిజానికి శంఖం మతపరంగానే కాదు.. దీని వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు తెలుసా?. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

25

క్రమం తప్పకుండా శంఖాన్ని ఊదడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గిపోతాయి. అంతేకాదు మీ చర్మం బిగుతుగా మారుతుంది. దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. వయసు మీద పడుతుంది అన్న భావనే కలగదు. రోజూ శంఖం ఊదితే నోట్లోని కండరాలపై ఒత్తిడి పడుతుంది. ముఖ కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. 

35

రెగ్యులర్ గా శంఖాన్ని ఊదితే.. ఊపిరితిత్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రోన్కైటిస్,  ఆస్తమా రోగులకు శంఖు షెల్ ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. ఇది ఫారింక్స్ కండరాలకు వ్యాయామంలా పనిచేస్తుంది. శ్వాసలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. శ్వాస సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఊపిరితిత్తుల కూడా సామర్థ్యాన్ని పెరుగుతుంది.
 

45

శంఖాన్ని ప్రతిరోజూ ఊదితే.. మూత్రాశయం, పొత్తికడుపు దిగువ భాగం, డయాఫ్రాగమ్, మెడ, భుజం కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథికి కూడా ప్రయోజకరంగా ఉంటుంది. 
 

55

ప్రతిరోజూ శంఖం ఊదితే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. డిప్రెషన్ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. 

శంఖం ఊదడం వల్ల థైరాయిడ్ గ్రంధులు, స్వరపేటికలకు వ్యాయామం అవుతుంది. దీనివల్ల వీటిలో ఏ సమస్య ఉన్నా తగ్గిపోతాయి. 

శంఖం ఊదడం వల్ల ఊపిరితిత్తులు, కడుపు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలోని వివిధ భాగాల మధ్య బంధం ఏర్పడుతుంది. ఇది  రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mixer Jar Blades: ఈ ఒక్క పని చేస్తే..నిమిషాల్లో మీ మిక్సీ జార్ కొత్తదానిలా పని చేస్తుంది..!
Recommended image2
Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు
Recommended image3
Face Tan: ఎండకు నల్లబడ్డారా? ఇవి రాస్తే ట్యాన్ పోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved