Hair Growth Tips : ఇలా చేస్తే మీ జుట్టు సేఫ్
Hair Growth Tips : జుట్టుతోనే అందం.. ఆనందం. అదే జుట్టు రాలిపోతూ ఉంటే ఎంతో ఆందోళనకు గురవతుంటారు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలిరా దేవుడా అంటూ జుట్టును పీక్కుంటుంటారు. ఒకవేళ మీరు కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడితే.. దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. జుట్టు సంరక్షణ చర్యలు ఎంత తొందరగా తీసుకుంటే మీ హెయిర్ అంత సేఫ్ గా ఉంటుంది.

Hair Growth Tips : ప్రస్తుత కాలంలో హెయిర్ ఫాల్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా ఈ సమస్య యువతను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్యతో వారు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. అంతేకాదు.. దీని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించి తీమ్రమైన ఒత్తిడి గురై.. ఇంకా ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా మీజుట్టును క్షేమంగా కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మసాజ్: జుట్టు సంరక్షణ చర్యలలో మసాజ్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే తరచుగా జుట్టును మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. అంతేకాదు ఈ మసాజ్ వల్ల నెత్తికి బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరుగుతుంది. దాంతో వెంట్రుకలు ఒత్తుగా ఉంటాయి. అంతేకాదు దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. వీటితో పాటుగా హెయిర్ మాస్కులు, హెయిర్ ఆయిల్ వల్ల కూడా వెంట్రుకలు ఒత్తుగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జుట్టును మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, అలసట క్షణాల్లో మటుమాయం అవుతాయి.
Hair Rejuvenator: Aloe vera gel is an excellent hair rejuvenator and tonic. Take a leaf, cut it lengthwise into half and scoop out the clear gel from the inside. Blend this with 1egg and 2-3tsp olive oil, and massage into the scalp and hair. Cover with a hot towel for 10 minutes and shampoo after 40 minutes. If done twice a week, you will notice that your hair fall has reduced and your hair has started to look healthier and conditioned.
కలబంద: కలబంద ఎన్నో ఔషద గుణాల గని అని మనందరికీ తెలిసిందే. ఈ అలొవెరా తో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఇది హెయిర్ కు మంచి conditioner లాగా కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు జుట్టును మృదువుగా చేయడంలో కూడా ఇది ముందుంటుంది. ముఖ్యంగా డాండ్రఫ్ సమస్యను దూరం చేస్తుంది. స్వచ్ఛమైన కలబంద గుజ్జును వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే కలబంద కండీషనర్లు, షాంపు వాడినా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
కొబ్బరి నూనె: ప్రస్తుత కాలంలో కొబ్బరి నూనె పెట్టేవారు చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ ఇందులో ఫ్యాటీ యాసిడ్లు మెండుగా లభిస్తాయి. ఇవి హెయిర్ లోనికి వెళ్లి వాటికున్న ప్రోటీన్ లోపాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈ కొబ్బరి నూనెను హెడ్ బాత్ చేసే రెండు గంటల ముందు పెట్టుకుని స్నానం చేసినా లేదా చేసిన తర్వాత పెట్టినా చక్కటి ఫలితం ఉంటుంది. అయితే నైట్ టైం హెయిర్ కు నూనెను పెట్టుకుని ఉదయం హెడ్ బాత్ చేస్తే కూడా జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె పెట్టడం వల్ల కేశాలు ఆరోగ్యంగా , అందంగా ఉంటాయి.
నిమ్మనూనె: నిమ్మకాయ కూడా హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు దీనివల్ల మీ కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనికోసం మీరేం చేయాలంటే.. ఫ్రెష్ నిమ్మకాయను తీసుకుని దాని నుంచి రసాన్ని తీసి వెంట్రుకలకు అప్లై చేయాలి. ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి .. ఆ తర్వాత తక్కువ గాఢత గల షాంపును పెట్టుకుని హెడ్ బాత్ చేయాలి. దీనితో పాటుగా ప్రతిరోజు మీరు పెట్టుకుని హెయిర్ ఆయిల్ లో Lemon Essential నూనెను కొన్నిచుక్కలు వేసుకోవాలి. దాన్ని చిక్కగా కాకుండా పలుచగా చేసుకుని వెంట్రుకలకు మాస్క్ లా వేసుకున్నా చక్కటి ఫలితం ఉంటుంది.