hair growth tips: వీటిని తింటే మీ జుట్టు ఊడిపోయే సమస్యే ఉండదు..
hair growth tips: హెయిర్ లాస్ సమస్య నుంచి తొందరగా బయటపడటానికి ఎన్నో టిప్స్ ను పాటిస్తూ ఉంటారు. అయితే జుట్టు బలంగా ఉండాలన్నా, కేశాలు ఊడిపోకుండా ఉండాలన్నా బలమైన ఆహారం ఎంతో అవసరం. ఈ ఆహారం ద్వారానే జుట్టు మరింత దృఢంగా , అందంగా తయారవుతుంది.

hair growth tips: ఒత్తైన, నల్లని హెయిర్ ఎవరి ఉండాలని ఉండదు చెప్పండి.. అందుకే కదా వయసుతో సంబంధం లేకుండా తమ జుట్టును కాపాడుకోవడానికి ఎన్నో ఎన్నెన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే ఈ చిట్కాలు పాటించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. మొదటికే మోసం వస్తుంది.
హెయిర్ ను కాపాడుకునే ప్రాసెస్ లో చాలా మంది ఎక్కువగా హెయిర్ ప్యాక్ లను, మాస్కులనే వాడుతుంటారు. ఇవే కాకుండా కొన్ని రకాల కూరగాయలు కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు హెయిర్ ఫాల్ సమస్యను నివారించి, జుట్టును బలంగా చేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మరి కురుల ఎదుగుదలకు సహాయపడేందుకు ఎలాంటి కూరగాయలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలకూర: హెయిర్ ఫాల్ సమస్య రావడానికి ఐరన్ లోపం కూడా ఒక కారణమే. ఇలాంటి వారికి పాల కూర ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరలో ఐరన్, పీచుపదార్థం, జింక్ వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిద్వారా జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూర హెయిర్ ఫాల్ సమస్యను నివారించి, జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది.
క్యారెట్: క్యారెట్ లో బయోటిన్ అని పిలవబడే విటమిన్ బీ7 మెండుగా ఉంటుంది. ఇది కురుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. అంతేకాదు ఇది జుట్టును బలంగా, నిగనిగలాడేలా చేస్తుంది. కాబట్టి ఈ క్యారెట్ ను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. అలాగే క్యారెట్ తో చేసిన హెయిర్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఇందుకోసం .. కొన్ని క్యారెట్లను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసం నీటిలో వేసి ఉకబెట్టాలి. ఆ తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గడమే కాదు వెంట్రుకలు బలంగా కూడా అవుతాయి.
ఉల్లిపాయ: ఉల్లిగడ్డలో ఐరన్, జింక్, బయోటిన్ వంటి ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి కేశాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాగా ఇవి జుట్టు తెల్లబడే సమస్య నుంచి బయటపడేయడంతో పాటుగా జుట్టును దృఢంగా చేస్తుంది. అందుకే మీ రోజు వారి ఆహారంలో దీన్ని భాగం చేసుకోండి.
చిలకడదుంపలు: కురుల సంరక్షణకు బీటాకెరోటిన్ ఎంతగానో సహాయపడుతుంది. కాగా ఈ బీటా కెరోటిన్ చిలకడదుంపల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లి విటమిన్ ఎ గా మారుతుంది. ఇది వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి ఈ చిలకడగదుంపలను మీ రోజు వారి ఆహారంలో తీసుకుంటే హెల్తీ కురులు మీ సొంతమవుతాయి.
టొమాటో: టొమాటోలు కేశాల నిగారింపుకు ఎంతగానో సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మాడుపై ఉండే మలినాలను, టాక్సిన్లు తొలగిపోయేలా చేస్తాయి. అంతేకాదు ఒత్తైన జుట్టుకు టొమాటోలు ఎంతో అవసరం. టొమాటో గుజ్జును అప్పుడప్పుడు జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మెరిసిపోతుంది.