MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Gen Z Bald Head: పాపం.. జెన్ జీ మగాళ్లు బట్టతల బాబాయ్‌లుగా మారిపోతున్నారు, ఎందుకో తెలుసా?

Gen Z Bald Head: పాపం.. జెన్ జీ మగాళ్లు బట్టతల బాబాయ్‌లుగా మారిపోతున్నారు, ఎందుకో తెలుసా?

Gen Z Bald Head: ప్రస్తుత జెన్-జీ అబ్బాయిల్లో చిన్న వయసులోనే జుట్టు రాలిపోతోంది. దీంతో 30 ఏళ్ల లోపే బట్టతల బారిన పడుతున్నారు వీరు. దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నప్పటికీ, ప్రధానంగా జీవనశైలి మార్పులే ఈ సమస్యకు కారణమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 24 2026, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాపం జెనరేషన్ జెడ్
Image Credit : Getty

పాపం జెనరేషన్ జెడ్

జుట్టు రాలడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ముఖ్యం ఇప్పటి యువతలో జుట్టు రాలిపోతోంది. జెనరేషన్ జెడ్ కు చెందిన అబ్బాయిలు విపరీతంగా బట్టతల బారిన పడుతున్నారు. జనరేషన్ జెడ్ అంటే 1995 నుంచి  2010 మధ్య కాలంలో జన్మించిన వారు. ఇప్పుడు వీరు 16 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటారు. ఈ మగవారిలోనే బట్టతల వచ్చేస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఇది వారి రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతుంది.  జెన్-జీ అబ్బాయిల్లో చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం వారిలో నిరాశను నింపేస్తుంది. దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నప్పటికీ, జీవనశైలి మార్పులే అసలు కారణమని చెబుతున్నారు నిపుణులు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
25 ఏళ్ల లోపే...
Image Credit : Getty

25 ఏళ్ల లోపే...

ప్రముఖ హెయిర్ కేర్ సంస్థ ట్రాయా  ఐదు లక్షల మంది పురుషులపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ డేటా ప్రకారం జుట్టు రాలడం సమస్య ఎదుర్కొంటున్న వారిలో 50 శాతం మంది మగాళ్లు 25 ఏళ్లలోపు వారేనని తేలింది. దీంతో యువత బట్టతల బాబాయ్ లుగా మారుతున్నారని తేలింది.  గతంలో 30 ఏళ్లు దాటిన పురుషుల్లో జుట్టు రాలడం కనిపించేది. కానీ ఇప్పుడు 20 ఏళ్ల వయసులోనే చాలామంది అబ్బాయిలు జుట్టును కోల్పోతున్నారు. 

34
ఈ పనుల వల్లే
Image Credit : Getty

ఈ పనుల వల్లే

కొందరికి బట్టతల వారసత్వంగా వస్తుంది.  వంశపారంపర్య కారణాల వల్ల వచ్చే వాటిని అడ్డుకోలేము. కానీ జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్లు, చెడు ఆహారం వల్ల ఇప్పుడు యువత జుట్టును కోల్పోతున్నారు. సరిగ్గా నిద్రపోకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, తక్కువ ప్రోటీన్ తీసుకోవడం వంటివి జుట్టు రాలడాన్ని మరింత పెంచుతాయి. వేగంగా బరువు తగ్గడం లేదా సరైన పోషకాహారం లేకుండా చేసే వ్యాయామాల వల్ల శరీరంలో ఐరన్, విటమిన్ డి, బి12 వంటి పోషకాల లేమి ఏర్పడుతుంది. ఇవన్నీ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. కాబట్టి పోషకాహార లోపం, ఒత్తిడి, నిద్రలేమి వంటివి లేకుండా చూసుకోండి.

44
ధూమపానం వెంటనే మానేయండి
Image Credit : Getty

ధూమపానం వెంటనే మానేయండి

కొంతమంది అబ్బాయిలు తరచూ హెయిర్ స్టైలింగ్ చేస్తారు. జుట్టుకు రంగులు వేస్తారు.  రసాయన ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వల్ల తల చర్మంపై ఉన్న ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ధూమపానం, అధికంగా కెఫిన్ తీసుకోవడం కూడా జుట్టు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. కాబట్ట కాఫీ అధికంగా తాగకూడదు, ధూమపానం అలవాటును వెంటనే మానేయాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Related Stories
Recommended image1
Fan Cleaning: ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నా గాలి రావట్లేదా? ఈ చిన్న పని చేయండి
Recommended image2
Heartbreaking Video: ఒక్క ముద్ద అన్నం కోసం వానలో క్యూలో నిల్చున్న చిన్నారులు, గుండె పగిలిపోయే వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved