MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Garuda Purana: ప్రతి రోజూ ఈ 5 పనులు చేస్తే.. మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు..!

Garuda Purana: ప్రతి రోజూ ఈ 5 పనులు చేస్తే.. మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు..!

Garuda Purana: జీవితంలో విజయం సాధించాలి అనుకుంటే.. కష్టపడితే సరిపోదు. గరుడ పురాణం ప్రకారం, కొన్ని అలవాట్లను మార్చుకుంటే... లైఫ్ లో సక్సెస్ సులభంగా అవ్వగలరు. ఆ అలవాట్లు ఏంటి..?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 12 2026, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Garuda Purana
Image Credit : Asianet News

Garuda Purana

గరుడ పురాణంలో మనిషి పుట్టుక నుంచి మరణం వరకు, అలాగే మరణానంతరం జరిగే విషయాల గురించే కాకుండా, భూమిపై సుఖ సంతోషాలతో, విజయవంతంగా ఎలా జీవించాలనే దానిపై ఎన్నో అమూల్య జీవన సూత్రాలు తెలియజేశారు. మనం చేసే మంచి, చెడు పనుల బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుందని గరుడ పురాణం స్పష్టం చేస్తుంది. మరీ ముఖ్యంగా, ప్రతి రోజూ 5 పనులు చేయడం వల్ల లైఫ్ లో తొందరగా సక్సెస్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కుల దేవుడిని మరువకూడదు..
Image Credit : Instagram

కుల దేవుడిని మరువకూడదు..

గతంతో పోలిస్తే ఇప్పుడు వంశాలు, గోత్రాలను పట్టించుకోవడం తగ్గిపోయింది. కానీ గరుడ పురాణం ప్రకారం ప్రతి వంశానికి ఒక కులదేవత లేదా దేవుడు ఉంటారు. పూర్వీకుల కాలం నుంచి పూజిస్తున్న ఆ దైవాన్ని ఎన్నటికీ మరువకూడదు. ప్రతిరోజూ కులదేవుడిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలి. ప్రతిసారీ మూలస్థానానికి వెళ్లడం కుదరకపోయినా, ఎక్కడ ఉన్నా ఆ దేవుడిని ప్రార్థించి తరచుగా దర్శనం చేసుకోవాలి. ఇలా కులదేవుడిని నిత్యం స్మరించుకోవడం వల్ల ఆ కుటుంబానికి, రాబోయే పిల్లలు, మనవళ్ల తరాలకు కూడా అంతా మంచి జరుగుతుందని, ఏడు తరాల వారు సంతోషంగా ఉంటారని గరుడ పురాణం చెబుతోంది.

దేవునికి నిత్య నైవేద్యం సమర్పించడం:

చాలా ఇళ్లలో ఇప్పటికీ దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతే భుజించే ఆచారం ఉంది. భగవంతునికి నిత్యం అన్నం నైవేద్యంగా సమర్పించి, కుటుంబ సమేతంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆ ఇంట్లో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. దీనివల్ల ఇంట్లో తిండికి, ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతూ, సాత్విక ఆహారాన్ని తయారు చేసి దేవునికి అర్పించడం మంచిది.

33
అన్నదానం..
Image Credit : our own

అన్నదానం..

హిందూ సంప్రదాయంలో దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆకలితో ఉన్నవారికి, పేదవారికి ఆహారం అందించడం ద్వారా గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని ఇతరుల సహాయం కోసం, దాతృత్వ కార్యక్రమాల కోసం కేటాయించాలని గరుడ పురాణం చెబుతోంది.

మత గ్రంథాల పారాయణం:

మత గ్రంథాలను పఠించడం వల్ల మనిషికి లోతైన జ్ఞానం లభిస్తుంది. ఆ గ్రంథాలలో దాగివున్న సత్యాలను, మంచి విషయాలను తెలుసుకుని జీవితంలో అలవర్చుకోవాలి. జీవితంలో ఎలాంటి కష్టాలు, సంక్షోభాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని మతపరమైన విద్య ఇస్తుంది.

ప్రశాంత స్వభావం, ధ్యానం:

నిత్య జీవితంలో ధ్యానం, మంత్ర పఠనం వంటివి చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇవి మనస్సును అశాంతికి గురికాకుండా కాపాడుతాయి. ఎంతటి కష్టకాలంలోనైనా తొందరపడకుండా సరైన, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ మానసిక ప్రశాంతత ఎంతగానో సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించేందుకు బెస్ట్ శారీస్ డిజైన్లు
Recommended image2
Paneer vs Chicken: పనీర్, చికెన్.. ప్రోటీన్ లో కింగ్ ఎవరు? బరువు తగ్గేందుకు ఏది బెస్ట్?
Recommended image3
Curd: కేవలం గంటలో పాలను గడ్డ పెరుగులా మార్చేయచ్చు..ఈ సింపుల్ చిట్కా తెలిస్తే చాలు..!
Related Stories
Recommended image1
Cooking Tips: ఇదొక్కటి రెండు చుక్కలు వేస్తే.. బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది..!
Recommended image2
Curd: కేవలం గంటలో పాలను గడ్డ పెరుగులా మార్చేయచ్చు..ఈ సింపుల్ చిట్కా తెలిస్తే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved