MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Goa Temple: గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి.. అక్కడ స్పెషాలిటీ ఇదే

Goa Temple: గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి.. అక్కడ స్పెషాలిటీ ఇదే

Goa Temple: గోవా అంటే బీచ్‍లు, నైట్ లైఫ్, పర్యాటక ప్రదేశాలే. కానీ ఏళ్ల చరిత్రను చెప్పే ఎన్నో పురాతన ఆలయాలూ ఉన్నాయి. గోవా వారసత్వానికి సజీవ సాక్ష్యాలు. బాలీవుడ్ బామ భూమి గోవాలోని పురాతన అమ్మవారిని దర్శించడంతో వాటి గురించి తెలుసుకునే పనిలో పడ్డారు.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 21 2026, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బీచ్‍లే కాదు..పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి
Image Credit : chatgpt

బీచ్‍లే కాదు..పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి

గోవా అంటే చాలా మందికి గుర్తొచ్చేవి బీచ్‍లు, నైట్ లైఫ్, వాటర్ స్పోర్ట్స్, పర్యాటక ప్రదేశాలే. కానీ గోవాలో వందల ఏళ్ల చరిత్రను చెప్పే ఎన్నో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో ఉత్తర గోవాలోని పెడ్నే ప్రాంతంలో ఉన్న శ్రీ దేవి మౌళి ఆలయం ఒకటి. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు...గోవా సంస్కృతి, వారసత్వానికి కూడా ప్రతీకగా నిలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దుర్గాదేవి అవతారంగా మౌళి దేవి
Image Credit : bhumisatishpednekkar/instagram

దుర్గాదేవి అవతారంగా మౌళి దేవి

ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా భావించే మౌళి దేవికి అంకితం చేశారు. ఫెడ్నేకర్ కుటుంబాలతో పాటు ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలు ఈ అమ్మవారిని తమ కులదేవతగా ఆరాధిస్తారు. ఆలయంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి సుమారు 400 ఏళ్లనాటి రాతి విగ్రహం. స్వచ్ఛమైన మంచినీటి ప్రవాహం పక్కనే ఈ విగ్రహం ఉంటుంది. ఆ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు చెబుతారు.

36
తమ కులదేవతను దర్శించుకున్న భూమి పెడ్నేకర్
Image Credit : bhumisatishpednekkar/instagram

తమ కులదేవతను దర్శించుకున్న భూమి పెడ్నేకర్

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తన 37వ పుట్టినరోజు సందర్భంగా తమ కులదేవత శ్రీ దేవి మౌళి ఆలయాన్ని దర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసుకోవడంతో..ఆలయం గురించి తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు.

46
ఇండో-పోర్చుగీస్ నిర్మాణశైలిలో కట్టడం
Image Credit : bhumisatishpednekkar/instagram

ఇండో-పోర్చుగీస్ నిర్మాణశైలిలో కట్టడం

ఇండో-పోర్చుగీస్ నిర్మాణశైలిలో రూపొందిన ఈ ఆలయంలో కొంకణ్ ప్రాంతానికి ప్రత్యేకమైన కావి కళ అలకరణలు కనిపిస్తాయి. ఎర్రటి మట్టి పూతతో రూపొంది ఈ సంప్రదాయ కళ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. ఆలయ ప్రాంగణంలోని చిన్న జలపాతం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది.

56
ఈ 3 దర్శిస్తేనే యాత్ర పూర్తైనట్లు
Image Credit : chatgpt

ఈ 3 దర్శిస్తేనే యాత్ర పూర్తైనట్లు

మహిషాసుర మర్దిని శిల్పం, పురాతన విగ్రహాలు, నంది సమేతంగా ఉన్న శ్రీ రామేశ్వర స్వామి ఆలయం ఈ క్షేత్రానికి మరింత చారిత్రక ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. పెడ్నే ప్రాంతంలో భక్తులు సాధారణంగా మూడు ఆలయాలను దర్శించడం సంప్రదాయం. రావళ్నాథ్ ఆలయం. మౌళి దేవి ఆలయం, భగవతి దేవి ఆలయాలను వరుసగా దర్శిస్తేనే యాత్ర పూర్తైనట్లు భావిస్తారు. గ్రామ రక్షక దైవంగా భావించే రావళ్నాథ్ స్వామిని కొత్త ఇల్లు, కొత్తగా పెళ్లైన వారు లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు తప్పకుండా దర్శించుకోవడం ఆనవాయితీ.

66
గోవా వారసత్వానికి నేటికీ సజీవ సాక్ష్యాలు
Image Credit : bhumisatishpednekkar/instagram

గోవా వారసత్వానికి నేటికీ సజీవ సాక్ష్యాలు

భగవతి దేవి ఆలయాన్ని సందర్శించి ఈ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేస్తారు. ఈ మూడు ఆలయాలు గోవా ఆధ్మాత్మిక సంప్రదాయానికి, సాంస్కృతిక వారసత్వానికి నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Navaratri Fasting: నవరాత్రి ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ 9 రోజులు ఇలా ప్లాన్ చేసుకోండి
Recommended image2
Long Haram: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే లాంగ్ హారం డిజైన్లు..!
Recommended image3
Exercises : మీరు పొట్టిగా ఉన్నారా? ఈ ఎక్సర్‌సైజులు చేస్తే పక్కా హైట్
Related Stories
Recommended image1
IRCTC: భక్తులకు 9 రోజుల ఆధ్యాత్మిక టూర్... ఒక్క ప్యాకేజీలో 4 పవిత్ర క్షేత్రాల యాత్ర, IRCTC అదిరే ప్యాకేజీ
Recommended image2
Clothing Sizes: రోజూ చూస్తాం కానీ అర్థం తెలియదు.. బట్టల సైజుల్లో ఉండే ఈ 'X' మీనింగ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved