Onion Juice For Hair : మలైకా నుంచి సారా అలీఖాన్ వరకు... ఉల్లిపాయ రసమే బెస్ట్ అంటున్న బాలీవుడ్ బ్యూటీస్...
జుట్టు సమస్య ఏదైనా కానీ.. ఉల్లిగడ్డ రసం ప్రభావవంతంగా పనిచేస్తుందని అనేకసార్లు నిరూపించబడింది. అనేకమంది దీని ప్రయోజనాల గురించి అనేకసార్లు చెప్పారు కూడా. సామాన్యులే కాదు బాలీవుడ్ బ్యూటీలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు.
జుట్టు సమస్యలు ప్రతీ ఒక్కరినీ ఇబ్బంది పెట్టేవే.. జుట్టు రాలిపోవడం, తెల్లబడడం, పలుచబడడం, అనారోగ్యకరంగా తయారవ్వడం, చుండ్రు, పేలు... ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్నవారు అనేకమంది ఉన్నారు. వీటి నివారణకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు.
జుట్టు సమస్య ఏదైనా కానీ.. ఉల్లిగడ్డ రసం ప్రభావవంతంగా పనిచేస్తుందని అనేకసార్లు నిరూపించబడింది. అనేకమంది దీని ప్రయోజనాల గురించి అనేకసార్లు చెప్పారు కూడా.
అందుకే ఇటీవలి కాలంలో మార్కెట్లో లభిస్తున్న షాంపూలు, నూనెలు, హెయిర్ క్రీమ్ లలో చిన్న ఉల్లిపాయల రసాన్ని వాడుతున్నారు. ఈ మేరకు వాటిమీద మెన్షన్ చేస్తున్నారు కూడా. అందుకే కొద్ది మొత్తంలో ఉల్లిపాయ రసాన్ని చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని.. తలకు పెట్టుకోవడం వల్ల సమస్యతో పోరాడొచ్చు.
సామాన్యులే కాదు బాలీవుడ్ బ్యూటీలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. బిపాసాబసు, తమన్నా బాటియా, సారా అలీఖాన్, మలైకా అరోరా లాంటి ఎంతోమంది అందగత్తెలు తమ అందమైన, నిగనిగలాడే జుట్టుకోసం ఉల్లిపాయ రసాన్ని వాడామని చెబుతున్నారు.
ఇంత మంచి ప్రయోజనాలున్నాయని చెబుతున్న ఉల్లిపాయ రసం ఎలా పనిచేస్తుంది అంటే.. దీంట్లో విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలెట్, పొటాషియం ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా మంచివి. జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అయితే దీన్ని తాగడం కంటే జుట్టుకు రాసుకోవడం వల్లే ఉపయోగం ఎక్కువగా ఉంటుందట.
ఈ ఉల్లిపాయ రసాన్ని ఎలా తయారు చేయాలి... అంటే ఉల్లిగడ్డను సన్నటి ముక్కలుగా కోసి... మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఓ మస్లిన్ క్లాత్ లో వేసి రసాన్ని తీయాలి. దీన్ని ఓ శుభ్రమైన జార్ లో వేసుకుని భద్రపరిచి వాడుకోవాలి.
అయితే ఉల్లిపాయ రసం నేరుగా తలకు పెట్టుకుంటే మాడు మీద చికాకు కలుగుతుంది. ఇరిటేషన్ పుడుతుంది. అందుకే ఉల్లిపాయ రసాన్ని నేరుగా కాకుండా తేనె, కొబ్బరి నూనె, అలోవెరా లాంటి sooting agents తో కలిపి తలకు రాసుకోవడం మంచిది.
ఒకవేళ మీకు ఉల్లిగడ్డతో అలెర్జీ ఉంటే దీన్ని అస్సలు ట్రై చేయకూడదు. దీనికోసం ముందుగా అలెర్జీ టెస్ట్ చేసుకోండి. ఆ తరువాతే వాడండి.
ఉల్లిపాయ అంటేనే ఘాటైన వాసన. ఇక దాన్ని తలకు పెట్టుకుంటే ఆ వాసనతో తలనొప్పి, చికాకు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఉల్లిపాయ పడ్డా, వాసన పడకపోవచ్చు. అందుకే ఈ వాసన లేకుండా ఉల్లిపాయరసం బెనిఫిట్స్ పొందాలి.
దీనికోసం కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్స్ ను ఈ ఉల్లిపాయ రసం మిశ్రమానికి కలపాలి. దీనివల్ల వాసనను ఎస్సెన్షియల్ ఆయిల్ కవర్ చేస్తుంది. లావెండర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ లాంటి essential oils ను ఉల్లిపాయ రసంలో కలుపుకుని వాడుకోవచ్చు.