MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fresh Mutton Vs Dry Mutton : తాజా మటన్, డ్రై మటన్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ మంచిది?

Fresh Mutton Vs Dry Mutton : తాజా మటన్, డ్రై మటన్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ మంచిది?

Fresh Mutton Vs Dry Mutton: నాన్ వెజ్ ప్రియులకు మటన్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అయితే.. మటన్ తాజాగా ఉన్నప్పుడు తినడం మంచిదా? లేక..డ్రైగా ఉన్నప్పుడు తినడం ఇష్టమా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 15 2026, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మటన్ ఎలా తింటున్నారు?
Image Credit : gemini ai

మటన్ ఎలా తింటున్నారు?

మనలో చాలా మందికి నాన్ వెజ్ ప్రియులకు మటన్ అనే పేరు వినగానే నోరూరుతోంది. ఆదివారం వచ్చింది అంటే చాలు వేడి వేడి మటన్ కర్రీ లేదా ఫ్రై ఉండాల్సిందే. అయితే, తాజా మాంసంతో వండుకునే మటన్ కు ఉండే క్రేజ్ వేరు. కానీ, కొన్ని ప్రాంతాల్లో మటన్ ని ఎండబెట్టి... స్టోర్ చేసుకుంటారు. ఆ తర్వాత, నచ్చినప్పుడు వండుకుంటారు. మరి, ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? తాజా మటన్, డ్రై మటన్ ఎలా తింటే ఎక్కువ పోషకాలు మనకు అందుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తాజా మటన్ వర్సెస్ డ్రై మటన్.. ఏది ఆరోగ్యానికి మంచిది?
Image Credit : gemini ai

తాజా మటన్ వర్సెస్ డ్రై మటన్.. ఏది ఆరోగ్యానికి మంచిది?

తాజా మటన్: తాజా మటన్ లో శరీరానికి కావాల్సిన సహజమైన పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని మితంగా, సరిపడా పరిమాణంలో వండుకొని తింటే శరీరానికి మంచి శక్తి అందుతుంది. అయితే, ఇందులో కొవ్వు శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి, దీన్ని ప్రతిరోజూ లేదా అతిగా తినడం వల్ల గుండె ఆరోగ్యానికీ, బరువు పెరగడానికి దారితీసే అవకాశం ఉంటుంది.

డ్రై మటన్: మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా ఎండబెట్టి తయారు చేసే ఈ డ్రై మటన్ లో తేమ పూర్తిగా ఆవిరైపోతుంది. దీనివల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కానీ, దీన్ని పాడవకుండా నిల్వ చేయడానికి, రుచిగా మార్చడానికి ఉప్పు, మసాలాలు చాలా ఎక్కువగా వాడతారు. ఉప్పు మోతాదు మించి ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఇది గట్టిగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా మారి,కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు.

పోషకాల పరంగా చూస్తే డ్రై మటన్ కంటే తాజా మటన్‌ చాలా మంచిది. డ్రై మటన్‌లో సోడియం, ప్రిజర్వేటివ్స్ మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీన్ని తరచుగా తినకపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.

33
ఇంట్లోనే డ్రై మటన్ తయారు చేసుకునే విధానం:
Image Credit : Gemini AI Generated

ఇంట్లోనే డ్రై మటన్ తయారు చేసుకునే విధానం:

పల్లెల్లో లేదా సాంప్రదాయ పద్ధతుల్లో మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి డ్రై మటన్‌ను తయారు చేస్తుంటారు. దీన్ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:

మటన్ (ఎముకలు లేని సన్నని ముక్కలు): 1 కిలో

ఉప్పు: తగినంత పసుపు: 1 టీస్పూన్

కారం లేదా మిరియాల పొడి: రుచికి సరిపడా

తయారీ విధానం:

ముక్కల ఎంపిక: ముందుగా మటన్‌ను కొవ్వు లేని భాగం చూసి, వీలైనంత సన్నని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడగాలి. ముక్కలు ఎంత సన్నగా ఉంటే ఎండలో అంత త్వరగా ఆరుతాయి.

మ్యారినేషన్: శుభ్రం చేసిన మటన్ ముక్కలకు తగినంత ఉప్పు, పసుపు, కారం బాగా పట్టించి కొన్ని గంటలు అలాగే నాననివ్వాలి.

ఎండబెట్టడం: ఆ ముక్కలను ఒక శుభ్రమైన తెల్లటి పలుచని గుడ్డపై లేదా పెద్ద పళ్లెంలో ఎండలో పరవాలి. దుమ్ము, దూళి తగలకుండా చూసుకోవాలి. లేదంటే.. సూది, దారంతో వాటిని ఒక దారానికి గుచ్చి మరీ.. ఎండబెట్టుకోవచ్చు. ఈ ముక్కల్లోని తేమ పూర్తిగా ఆవిరైపోయి, రాయిలా గట్టిగా మరే వరకు (సుమారు 3 నుంచి 5 రోజుల పాటు) రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో బాగా ఆరబెట్టాలి. తేమ పూర్తిగా పోయిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లేదా గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెలల తరబడి నిల్వ ఉంటుంది. దీన్ని అవసరమైనప్పుడు కూరల్లో వేసుకుని వండుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నాన్ వెజిటేరియన్స్ కోసం ఒట్టి తునకల కూర.. రాయలసీమ వారి స్పెషల్ వంట రెసిపీ ఇదిగో
Recommended image2
Whisky: విస్కీ అసలైన రుచి తెలియాలంటే ఎలా తాగాలి..? నీళ్లతోనా, ఐస్ తోనా..?
Recommended image3
Railway Travel Insurance: రైల్వే ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా..అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్
Related Stories
Recommended image1
Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!
Recommended image2
River: ఈ రెండు నదులు పక్కపక్కనే ప్రవహించినా కలవని నదులు ఇవి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved