- Home
- Life
- Foods for Healthy Liver: మీ కాలెయం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తినాల్సిందే.. లేదంటే?
Foods for Healthy Liver: మీ కాలెయం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తినాల్సిందే.. లేదంటే?
Foods for Healthy Liver: మన శరీరంలోని ఇతర భాగాల లాగే కాలెయం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అయితే కొన్ని రకాల ఆహారాుల లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటంటే..

ఇతర అవయవాల మాదిరిగా కాలేయ ఆరోగ్యం (Liver health) కూడా చాలా ముఖ్యమైనది. శరీరం నుండి మలినాలను బయటకు పంపడంలో కాలేయం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కామెర్లు (Jaundice), ఫ్యాటీ లివర్ (Fatty liver), లివర్ సిర్రోసిస్ (Liver cirrhosis) అనేవి కాలేయాన్ని ప్రభావితం చేసే వ్యాధులు. ఆరోగ్యకరమైన ఆహారం (Healthy foods),క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కాలేయాన్ని రక్షించగలవు. కాలెయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
కాఫీ (Coffee): కాఫీ కాలేయాన్ని (Liver) రక్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా కాఫీ తీగడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (Non-alcoholic fatty liver disease) అభివృద్ధి చెందే ప్రమాదం తక్కువగా ఉంటుంది. Southampton University నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ కాఫీ తాగే వారికి కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలా అని కాఫీని కప్పులకు కప్పులు తాగేయకూడదు.
సిట్రస్ పండ్లు (Citrus fruits): సిట్రిస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాలేయం ఆరోగ్యానికి ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో 'పాలీఫెనాల్స్' అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కాలెయాన్ని రక్షిస్తాయి.
చేపలు (Fish): సాల్మన్ (Salmon), సార్డినెస్ (Sardines) మరియు ట్యూనా (Tuna)వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఒమేగా -3 లను భర్తీ చేయడం వల్ల కాలేయ కొవ్వును తగ్గించడం, మంచి HDL కొలెస్ట్రాల్ ను పెంచడం, ట్రైగ్లిజరైడ్ స్థాయిల (Triglyceride levels)ను తగ్గించడం ద్వారా Nonalcoholic fatty liver disease (NAFLD) ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనం తేల్చి చెప్పింది.
ఓట్స్ (Oats): ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది NAFLD-సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది కాలేయాన్ని సంరక్షిస్తుంది మరియు మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గింజలు (Nuts): నట్స్ ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో ముందుటాయి. ఇన్సులిన్ నిరోధకత, ఆక్సీకరణ ఒత్తిడితో ముడిపడి ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా గింజలు ప్రయోజనకరంగా ఉంటాయి.
పసుపు (Turmeric powder): పసుపులో 'కర్కుమిన్' అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కాలేయ వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పసుపుకు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే సామర్థ్యం కూడా ఉంది.