MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Corona Recovery: కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటే ఇలా చేయండి..

Corona Recovery: కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటే ఇలా చేయండి..

Corona Recovery: ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎలా సోకుతుందో ఎవరూ చెప్పలేరు. చిన్నపెద్ద అంటూ తేడాలు లేకుండా మనల్నిఅటాక్ చేయడం మాత్రమే దానికి తెలుసిన పని. అందుకే కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా కొందరికి ఈ వైరస్ సోకుతుంది. ఆ పరిస్థితిలో మనం ఎలా ఉండాలి.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలంటే...  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 18 2022, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Corona Recovery: రెండున్నరేండ్ల నుంచి ప్రచంచ దేశాలను చిన్నాభిన్నం చేస్తోంది కరోనా వైరస్. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ లక్షల మంది ప్రాణాలను తీసింది. రోజురోజుకు కొత్త కొత్త రూపాలతో ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ వేరియంట్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తూ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. అందుకే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా ఒక వేల కరోనా సోకినా.. దాని నుంచి తొందరగా బయటపడాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

విశ్రాంతితోనే ఎన్నో రోగాల నుంచి ఈజీగా బయటపడొచ్చు. అందుకే ఏ వ్యాధికి గురైనా తగిన విశ్రాంతి తీసుకుంటే దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు. అందులోనూ కరోనా వైరస్ కు గురైన వారు కూడా వీలైనంత త్వరగా కోలుకోవాలంటే విశ్రాంతి ఎంతో ముఖ్యం. దీని బారిన పడిన వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీన్ని లైట్ గా తీసుకుంటే మాత్రం భవిష్యత్ లో కొవిడ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 
 

36

శరీరాని తగినంత నీటి శాతం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండేంది. అందులోనూ బాడీ డీ హైడ్రేటెడ్ గా ఉండాలంటే నీళ్లు ఎక్కువ మొత్తంలో తాగాల్సిందే. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంత ఎక్కువగా నీళ్లను తాగితే అంత మంచిది. కొవిడ్ నుంచి తొందరగా బయటపడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియన్ పరిశోధకుల ప్రకారం శరీరంపై వైరస్ ప్రభావం తక్కువగా ఉండాలంటే నీళ్లను ఎక్కువగా తాగాలని తెలుపుతున్నారు. అధికంగా నీళ్లను తాగడం వల్ల శరీరం కూడా మెరుగ్గా పనిచేస్తుంది. 

46


బాడీ ఫిట్ గా ఉండేందుకు వ్యాయామం ఎంతో అవసరం. కాగా కరోనా నుంచి త్వరగా బయటపడాలంటే ప్రతి రోజూ తేలికపాటి ఎక్సర్ సైజ్లు చేయడం అలవాటు చేసుకోండి. ఈ వ్యాయామాల్లో కపాలబాతి వంటి ప్రాణాయామాల వల్ల శ్వాసకోస సంబంధిత సమస్యలు రావు. అందులోనూ కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.   
 

56

ఆరోగ్యానికి మంచి పోషకవిలువలుండే ఆహారం ఎంతో ముఖ్యం. అందులోనూ అనారోగ్యానికి గురైన సమయంలో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా లభించే ఆహారాన్నే తీసుకోవాలి. అప్పుడే ఆ రోగాల నుంచి త్వరగా కోలుకోగలుగుతాం. తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరల్లో మంచి పోషకాలుంటాయి. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో ఉండేలా చూసుకోండి. జంక్ ఫుడ్, మసాలలు అధికంగా ఉండే ఆహారం, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ జోలికి అస్సలు వెల్లకూడదు. 

66
కరోనా భారినపడ్డవారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా బలహీనంగా మారిపోతున్నారు. ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురికావడం, ఆందోళనకు గురవుతుంటారు. దీని వల్ల వారి ఆరోగ్యం మరింత బలహీనంగా మారే ప్రమాదం పొంచిఉంది. అందుకే దీని నుంచి వీలైనంత తొందరగా రికవరీ కావాలంటే మాతం ధ్యానం చేయడం తప్పని సరి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Moisturizer: ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలంటే మీ మాయిశ్చరైజర్ ను ఇలా ఎంచుకోండి
Recommended image2
Dark Neck: మెడ నల్లగా మారిందా? ఇవి రాస్తే ఆ నలుపు పోవడం ఖాయం
Recommended image3
Mango Storage Tips : మామిడి పండ్లు కుళ్లిపోతున్నాయా..? ఇలా చేస్తే 15 రోజులైనా తాజాగా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved