MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కాలిన గాయాలు, చిన్న చిన్న దెబ్బలు తొందరగా మానడానికి వంటింటి చిట్కాలు మీ కోసం..

కాలిన గాయాలు, చిన్న చిన్న దెబ్బలు తొందరగా మానడానికి వంటింటి చిట్కాలు మీ కోసం..

కూరగాయలు కోస్తున్నప్పుడు వేళ్లు కట్ కావడం, వంట చేస్తున్నప్పుడు చేతులు కాలడం సర్వ సాధారణ విషయం. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో ఈ గాయలను చాలా తొందరగా నయం చేసుకోవచ్చు.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jan 20 2023, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కూరగాయలను కట్ చేస్తున్నప్పుడు మనమెంత జాగ్రత్తగా ఉన్నా.. ఎప్పుడో ఒకసారి వేళ్లు కొద్దిగా తెగుతుంటాయి. కొందరైతే చాకులతో కూరగాయలను కట్ చేస్తూ.. పెద్ద పెద్ద గాయలను చేసుకుంటారు. అలాగే వంట చేసేటప్పుడు కూడా చేతులు, వేళ్లు కాలుతుంటాయి. ఇది సర్వ సాధారణ విషయం. ఇకపోతే పిల్లలు ఆడకుంటూ కూడా చేతులకు, కాళ్లకు గాయాలు చేకుంటారు. తెగిన, కాలిన గాయాల వల్ల ఇతర పనులను చేసుకోవడం చాలా కష్టం. ఇవి అంత సులువుగా మానవు కూడా. చిన్న చిన్న గాయాలకు హాస్పటల్ కు వెళ్లాలనిపించదు. నిజానికి ఇలాంటి చిన్న గాయాలకు మీరు హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు తెలుసా? మీ వంటగదిలోని కొన్ని పదార్థాలతో ఈ గాయాలను చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చల్లని నీరు

వంట చేసేటప్పుడు మీ వేళ్లు కాలిపోయిన సందర్భాలు చాలానే ఉండి ఉంటాయి. లేదా వేడిగా ఉన్నవాటిని మీ పిల్లలు ముట్టుకుని గాయాలు చేసుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు. మీకైనా, మీ పిల్లలకైనా  చిన్నపాటి కాలిన గాయం అయితే.. మీరు చేయాల్సిన మొదటి పని 20 నిమిషాల పాటు కాలిన ప్రదేశాన్ని చల్లగా ఉంచండి. అంటే నీళ్లలో మాత్రం పెట్టకండి. గాయానికి చల్లని గాలి తగిలేలా చూసుకోండి. ఆయిల్ వల్ల కాలినట్టైతే  ఆ ప్రాంతాన్ని తేలికపాటి సబ్బు, నీటితో కడగండి.

36

కూల్ కంప్రెస్ లు

కాలిన ప్రదేశంపై చల్లని కంప్రెస్ లేదా శుభ్రమైన తడి గుడ్డను పెట్టండి. ఇది నొప్పి, వాపు నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. కోల్డ్ కంప్రెస్లను ఎక్కువగా ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించండి.  ఎందుకంటే ఇది చికాకును, ఎక్కువ మంటను కలిగిస్తుంది.
 

46

పసుపు

పసుపు ఒక శక్తివంతమైన వంటింటి పదార్ధం. ఎందుకంటే పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పసుపు ఎల్లప్పుడు వంటింట్లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.  ఉపయోగకరమైన, ప్రభావవంతమైన పసుపులో గొప్ప శోథ నిరోధక, క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. పసుపులో ఉండే హీలింగ్ ఏజెంట్స్ త్వరగా నయం కావడానికి సహాయపడతాయి. చిన్న చిన్న గాయాలు, తెగిన గాయాలపై ప్రథమ చికిత్సగా దీనిని ఉపయోగించొచ్చు. దీన్ని పెట్టడం వల్ల మీ చర్మంపై ఏదైనా ఇన్ఫెక్షన్ పెరగకుండా నిరోధించబడుతుంది. 
 

56

కలబంద

కలబందను  "బర్న్ ప్లాంట్" అని కూడా అంటారు. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు  కాలిని గాయాలు లేదా ఇతర గాయాలైతే స్వచ్ఛమైన కలబంద జెల్ అక్కడ అప్లై చేయండి. ఒకవేళ మీరు దుకాణం నుంచి కలబందను కొనుగోలు చేస్తే.. అందులో అధిక శాతం కలబంద ఉందని నిర్ధారించుకోండి.

66

తేనె

తేనె రుచిగా ఉండటమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది చిన్న చిన్న గాయలను, మంటను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది కాలిన గాయాలను, దెబ్బలను తగ్గిస్తుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Navaratna Jewellery: నవరత్నాలు పొదిగిన అందమైన జ్యూయలరీ చూసేయండి
Recommended image2
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image3
Lucky Bamboo: ఇంట్లో లక్కీ బ్యాంబూ మొక్కను ఇలా పెంచితే అదృష్టం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved