లక్కీ బ్యాంబూ మొక్కను నీటిలోనే కాదు మట్టిలో కూడా పెంచుకోవచ్చు. మట్టిలో పెంచేటప్పుడు, కుండీలో నీరు నిలిచిపోకుండా ఉండే మిశ్రమాన్ని వాడాలి.
Image credits: Asianet News
Telugu
కాంతి అవసరమా?
లక్కీ బ్యాంబూ మొక్కపై నేరుగా సూర్యరశ్మి ఎక్కువ కాలం పడకూడదు. ఆకులు మాడిపోతాయి. అందుకే గదిలో గాలి, వెలుతురు తగిలే చోట పెడితే సరిపోతుంది.
Image credits: Asianet News
Telugu
నీళ్లు మారుస్తూ ఉండాలి
నీటిలో మొక్కను పెంచితే.. కుళాయి నీటిలో క్లోరిన్, ఫ్లోరైడ్ ఉంటాయి. ఆ నీటి వల్ల ఆకుల చివర్లు మాడిపోవచ్చు. అందుకే వారానికి ఒకసారి తప్పనిసరిగా నీటిని మార్చడం మంచిది.
Image credits: Asianet News
Telugu
మట్టిలో పెంచితే ఎరువు..
లక్కీ బ్యాంబూకి ఎరువులు పెద్దగా అవసరం లేదు. మొక్క పెరుగుతున్నప్పుడు, నెలకొకసారి కొద్దిగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే చాలు. అలాగని ఎక్కువ వేయకూడదు.
Image credits: Asianet News
Telugu
కొమ్మలు కత్తిరించండి
మొక్క పచ్చగా అందంగా కనిపించాలంటే ఎక్కువగా పెరిగిన కొమ్మలను కత్తిరించండి. కత్తిరించిన కొమ్మలను నీటిలో పెడితే కొత్త వేర్లు వస్తాయి. కత్తిరించిన చోట వాక్స్ పూయడం మంచిది.
Image credits: Asianet News
Telugu
పెంపుడు జంతువులు ఉంటే..
లక్కీ బ్యాంబూ మొక్కలు పిల్లులు, కుక్కలకు ఏమాత్రం మంచివి కాదు. అవి పొరపాటున తింటే వాంతులు, లాలాజలం కారడం వంటివి జరుగుతాయి. మొక్కను కత్తిరించిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
Image credits: Asianet News
Telugu
ఫెంగ్ షుయ్ ఏం చెబుతోంది?
ఇంట్లో, ఆఫీసులో లక్కీ బ్యాంబూ పెంచడం ఎంతో అదృష్టం. ఫెంగ్ షుయ్ ప్రకారం సంపద, పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది.