సోంపు దాల్చిన చెక్క నీళ్లను రోజూ పరగడుపు తాగితే ఎంత మంచిదో
సోంపు, దాల్చిన చెక్క రెండూ మంచి ఔషదగుణాలున్న మసాలా దినుసులు. ఈ రెండు కలిపిన నీళ్లను రోజూ పరిగడుపున తాగితే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సోంపు, దాల్చిన చెక్క
బిజీ లైఫ్ స్టైల్ లో చాలా మందికి తమ ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే లేకుండా పోయింది. దీనివల్లే ఎన్నో జబ్బుల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. వీటిలో సోంపు, దాల్చిన చెక్క ఉన్నాయి. ఈ రెండింటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఎన్నో శారీరక సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ప్రతిరోజూ ఈ రెండింటిని కలిపిన నీళ్లను ఉదయాన్నే పరిగడుపున తాగితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అసలు ఈ సోంపు, దాల్చిన చెక్క వాటర్ ను తాగడం వల్ల మనం ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గుతారు
దాల్చిన చెక్క బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో జీవక్రియను పెంచే గుణాలుంటాయి. కాబట్టి దీన్ని తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ కరుగుతుంది. ఇకపోతే సోంపు ఆకలిని చాలా వరకు కంట్రోల్ చేసి పొట్ట, నడుము భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
మెరుగైన జీర్ణ వ్యవస్థ
దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు మంటను తగ్గిస్తాయి. అలాగే పేగులను క్లీన్ గా ఉంచడానికి సహాయపడతాయి. ఇకపోతే సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లు మలబద్దకం, గ్యాస్, ఎసిడటీ, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్
దాల్చిన చెక్క డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందది. అలాగే సోంపు కూడా బ్లడ్ షుగర్ ను స్థిరంగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, సోంపు వాటర్ ను తాగితే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది.
పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది
దాల్చిన చెక్క, సోంపు వాటర్ పీరియడ్స్ నొప్పిని, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ వాటర్ ను తాగితే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. సోంపులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు హార్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
సోంపు, దాల్చిన చెక్క వాటర్ ను ఎలా తయారుచేయాలి?
ఈ వాటర్ ను తయారుచేయడం చాలా సులువు. ఇందుకోసం ఒక గ్లాస్ వాటర్ లో టీ స్పూన్ సోంపు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ వాటర్ ను బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి అందులో కొంచెం నిమ్మరసం పిండుకుని తాగాలి.