Author: Shivaleela Rajamoni Image Credits:social media
Telugu
నిమ్మరసం
నిమ్మరసం మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి కూరలో కారాన్ని, ఉప్పును తగ్గించొచ్చు. ఇందుకోసం కొంచెం నిమ్మరసాన్ని కూరలో కలిపితే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
పెరుగు
పెరుగుతో కూడా కూరలో ఉప్పును సమతుల్యం చేయొచ్చు. కూరలో పెరుగును వేసి కలిపితే కూరలో ఎక్కువైన ఉప్పు తగ్గడమే కాకుండా కూర రుచిగా, చిక్కగా అవుతుంది.
Image credits: Pinterest
Telugu
నెయ్యి
నెయ్యితో కూడా మీరు కారాన్ని, ఉప్పును తగ్గించొచ్చు. ఇందుకోసం ఒక చెంచా నెయ్యిని కూరలో వేస్తే ఎక్కువైన ఉప్పు సమతుల్యం అవుతుంది.
Image credits: Getty
Telugu
ఆలుగడ్డ
ఆలుగడ్డలతో కూడా కూరలో ఎక్కువైన ఉప్పును, కారాన్ని తగ్గించొచ్చు. ఇందుకోసం ఆలుగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కోసి 5 నిమిషాలు ఉంచి తీసేయండి. ఇవి ఉప్పును, కారాన్ని పీల్చుకుంటాయి.
Image credits: Pinterest
Telugu
చక్కెర
కూరలో ఉప్పు ఎక్కువైతే మీరు అందులో చక్కెరను లేదా కొంచెం బెల్లాన్ని వేసినా సరిపోతుంది.
Image credits: Social Media
Telugu
జీడిపప్పు పేస్ట్
జీడిపప్పు పేస్ట్ ను కూరలో వేస్తే కూడా ఎక్కువైన ఉప్పు తగ్గుతుంది. టేస్ట్ బాగుంటుంది.
Image credits: Freepik
Telugu
ఉల్లిపాయ పేస్ట్
ఉల్లిపాయ పేస్ట్ తో కూడా కూరలో ఎక్కువైన ఉప్పును సమతుల్యం చేయొచ్చు. ఇందుకోసం మీరు కూరలో ఉల్లిపాయ పేస్ట్ ను వేసి కొద్దిసేపు మరిగించాలి.
Image credits: Getty
Telugu
శెనగపిండి
శెనగపిండిని కూడా మీరు కూరలో వేయొచ్చు. దీనివల్ల ఎక్కువైన ఉప్ప సమతుల్యం అవుతుంది.